అనుష్క బిగ్‌బాస్ షో కు ఎందుకు వెళ్లలేదు అంటే
అనుష్క బిగ్‌బాస్ షో కు ఎందుకు వెళ్లలేదు అంటే

బిగ్‌బాస్ ప్రేక్షకులకు ఈ ఆదివారం ఎంటర్‌టైన్‌మెంట్ డబుల్ కానుంది. ఎందుకంటే ఈ షోలో స్వీటీ అనుష్క సందడి చేయనుంది. సినిమా ప్రమోషన్ కోసం అని, లేదు గెస్ట్‌గా వస్తోందని, కాదు కాదు.. తనే హోస్ట్ అని రకరకాల వార్తలు వచ్చాయి. కట్ చేస్తే ఆదివారం ఎపిసోడ్‌లో అనుష్క కనిపించలేదు.

 

అస‌లే ఓటీటీలో రిలీజ‌వుతున్న సినిమా, దీనికి త‌గిన ప్ర‌చారం చేయ‌క‌పోతే క‌ష్ట‌మ‌ని చిత్ర‌యూనిట్ రిక్వెస్ట్ చేయడంతో ఎట్ట‌కేల‌కు అనుష్క ప్ర‌మోష‌న్స్‌కు‌ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. కానీ ఓ కండీష‌న్ పెట్టారు.

 

కేవ‌లం ఆన్‌లైన్ ప్ర‌మోష‌న్స్ మాత్ర‌మే చేస్తాన‌ని తెలిపారు. బ‌య‌ట‌కు వెళ్లి టీవీ ఛాన‌ల్స్‌లో ఇంటర్వూలు లాంటివి చేయ‌న‌ని తేల్చి చెప్పారు. దీంతో ఈ కార‌ణంగానే బిగ్‌బాస్ షోకు వెళ్లేందుకు నో చెప్పినట్లు అనుష్క పేర్కొన్నారు. కాగా అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘నిశ్శబ్దం’ అక్టోబర్ 2న ఓటీటీలో విడుదలవుతోంది. ఈ చిత్రంలో అనుష్క మూగ, చెవిటి పాత్రలో కనిపించనున్నారు.