అల్లుడు అదుర్స్‌ సెట్లో సోనూ సూద్‌ను సత్కరించిన ప్రకాష్ రాజ్
అల్లుడు అదుర్స్‌ సెట్లో సోనూ సూద్‌ను సత్కరించిన ప్రకాష్ రాజ్

హెల్పింగ్ హ్యాండ్  సోనూ సూద్‌ను విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌ ఈరోజు షూటింగ్‌ లొకేషన్‌లో సత్కరించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా సంతోష్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కతోన్న చిత్రం ‘అల్లుడు అదుర్స్‌’. ఈ చిత్రంలో సోనూ సూద్‌ కీలక పాత్రలోనటిస్తున్నారు.

కరోనా వైరస్‌ కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్‌.. కేంద్ర ప్రభుత్వ విధివిధానాలతో తిరిగి ప్రారంభమైంది. హైదరాబాద్‌లో జరుగుతున్న తాజా షెడ్యూల్‌లో సోనూ సూద్‌, ప్రకాష్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

 

కోవిడ్‌ సమయంలో కొన్ని వేల మంది ప్రజలకు సాయం చేసిన సోనూ సూద్‌‌ను అభినందిస్తూ ప్రకాష్ రాజ్‌ ప్రత్యేకంగా సత్కరించారు. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడయాలో వైరల్‌ అవుతున్నాయి. కోవిడ్‌ సమయంలో ప్రకాష్ రాజ్‌ కూడా ప్రజలకు తన వంతు సాయాన్ని అందించిన సంగతి తెలిసిందే.

 

‘అల్లుడు అదుర్స్‌’ చిత్రంలో నభా నటేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.