‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ లో వెంకటేష్ కి బదులు గా శర్వానంద్

0
524
'ఆడవాళ్లు మీకు జోహార్లు' లో వెంకటేష్ కి బదులు గా శర్వానంద్
'ఆడవాళ్లు మీకు జోహార్లు' లో వెంకటేష్ కి బదులు గా శర్వానంద్

2017లో టాలెంటెడ్ దర్శకుడు కిషోర్ తిరుమల వెంకటేష్ దగ్గుబాటి హీరోగా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే చిత్రాన్ని అనౌన్స్ చేశారు. కానీ ఎందుకో ఈ చిత్రం పట్టాలెక్కలేదు.

 

2017లో టాలెంటెడ్ దర్శకుడు కిషోర్ తిరుమల వెంకటేష్ దగ్గుబాటి హీరోగా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే చిత్రాన్ని అనౌన్స్ చేశారు. కానీ ఎందుకో ఈ చిత్రం పట్టాలెక్కలేదు. ఆ సమయంలో రామ్ తో ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ సినిమా తీశాడు కిశోర్. అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠీ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం ఓ మాదిరి టాక్ తెచ్చుకుంది. అనంతరం సాయి తేజ్ తో ‘చిత్రలహరి’ సినిమాను తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రజంట్ రామ్ తో తీసిన ‘రెడ్’ విడుదలకు సిద్దంగా ఉంది.

 

 

కాగా కిశోర్ తిరుమల తన పాత ప్రాజెక్ట్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మళ్లీ ట్రాక్ లోకి తెచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. యువ హీరో శర్వానంద్ ఈ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకోసం మేకర్స్ అదే టైటిల్‌ను లాక్ చేశారట. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం శర్వా ఆర్.ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతితో ‘మహా సముద్రం’ సినిమా చెయ్యాల్సి ఉంది. ‘శ్రీకారం’ మూవీ కూడా కాస్త ప్యాచ్ వర్క్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ‘ ఆడవాళ్లు మీకు జోహార్లు’ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.