ఆదిపురుష్ లో సీత పాత్ర గురించి అనుష్క ఏం చెప్పిందంటే
ఆదిపురుష్ లో సీత పాత్ర గురించి అనుష్క ఏం చెప్పిందంటే

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, ఓం రౌత్‌ దర్శకత్వంలో త్వరలో సెట్స్‌ పైకి వెళ్లనున్న పాన్ ఇండియా ఫిలిం ‘ఆదిపురుష్‌’. సైఫ్‌ అలీ ఖాన్‌ విలన్ పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో సీత పాత్ర విషయంలో ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కీర్తి సురేష్‌, కియారా అద్వానీ, ప్రియాంకా చోప్రా, అనుష్క శర్మ వంటి వారి పేర్లు బాగా వినిపించాయి

 

అలాగే ప్రభాస్‌ అనగానే ఎక్కువగా వినిపించే పేరు అనుష్క. ఆమె పేరు కూడా సీత పాత్ర లిస్ట్‌లో వినిపించింది. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం సీత పాత్రకు అనుష్క అయితే యాప్ట్ అంటూ.. రాముడిగా ప్రభాస్, సీతగా అనుష్క ఎలా ఉంటారో పోస్టర్స్ కూడా డిజైన్ చేశారు. అయితే ‘ఆదిపురుష్‌’ సీత పాత్రపై తాజాగా అనుష్క స్పందించారు.

 

ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. ఈ చిత్రం అక్టోబర్‌ 2న ఓటీటీలో విడుదల కాబోతోన్న సందర్భంగా మీడియాతో అనుష్క ముచ్చటించారు. ఈ సందర్భంగా అనుష్క ‘ఆదిపురుష్’లోని సీత క్యారెక్టర్‌పై వివరణ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘నాకు ‘ఆదిపురుష్’ టీమ్ నుంచి అటువంటి ఆఫర్‌ ఏమీ రాలేదు. నేను ఆ చిత్రంలో నటించడం లేదు. వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదు..’’ అని చెప్పారు.

 

టీ సిరీస్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాను తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అనువాదం చేయనున్నారు. ఈ చిత్రాన్ని త్రీడీలో రూపొదించనుండటం విశేషం.