Full Craze On Ram Ismart Shankar Movie, Film Preview, Cast
Full Craze On Ram Ismart Shankar Movie, Film Preview, Cast

టీజర్ నుండి ట్రైలర్స్ వరకు మాస్ మాటలతో,అక్కడక్కడ బూతులతో నింపి సినిమాకి కావాల్సిన బజ్ తీసుకురావడంలో సఫలం అయ్యాడు ఒకప్పుడు సెన్సేషనల్ డైరెక్టర్ అనిపించుకున్న పూరీ.ప్రస్తుతం మాత్రం అసలు పూరీ ని డైరెక్టర్ అని గుర్తించాలి అన్నా కూడా ఇస్మార్ట్ శంకర్ ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టి తీరాలి.అందుకే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమాకి పబ్లిసిటీ చేస్తున్నారు.

[INSERT_ELEMENTOR id=”3574″]

ఇక ఈ సినిమాలో బూతులు కూడా డైరెక్ట్ గా లేవు.అందుకే టీజర్ లో శాంపిల్ చూపించినా,ట్రైలర్ కి ఒక అడుగుముందుకు వేసినా,మాస్ నే దృష్టిలో పెట్టుకుని రెండో ట్రైలర్ లో రెచ్చిపోయినా ఎలాంటి కాంట్రవర్సీ రైజ్ కాలేదు.గురువారం నుండి లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ ని క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేసాడు ఇస్మార్ట్ శంకర్.ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే ఆ ప్లాన్ భారీగా వర్క్ అవుట్ అయ్యేలా ఉంది.పూరీ మీద రామ్ పెట్టుకున్న నమ్మకం,ఈ సినిమాపై పూరీ పెట్టుకున్న నమ్మకం నిజమయ్యేలా ఉంది.

[INSERT_ELEMENTOR id=”3574″]

రిలీజ్ కి ముందే సక్సెస్ సెలబ్రేషన్స్ అంటూ కమిట్ అయిన ప్రొడ్యూసర్ ఛార్మీ ఇక ఆ ఏర్పాట్లలో ఉండొచ్చు అనే పాజిటివ్ బజ్ నడుస్తుంది.ఈ సినిమాకి ఏ మాత్రం టాక్ బాగా ఉన్నా మొదటి నాలుగురోజుల్లో టికెట్ కౌంటర్ల దగ్గర అరాచకమయిన ఫిగర్స్ నమోదు అవుతాయి.ఇందులో ఏ అనుమానం అక్కర్లేదు.ఇప్పుడున్న పాజిటివ్ బజ్ కి ఇస్మార్ట్ శంకర్ హిట్ అనిపించుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు.

[INSERT_ELEMENTOR id=”3574″]