‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా కూడా రీమేక్ అవుతుందట హీరోగా రణ్ వీర్ సింగ్ ?
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా కూడా రీమేక్ అవుతుందట హీరోగా రణ్ వీర్ సింగ్ ?

గత నాలుగేళ్లుగా బాలీవుడ్ నిర్మాతల చూపు టాలీవుడ్ సినిమాల స్టోరీల పై పడింది. ఈ మధ్య ఇక్కడ హిట్టైన సినిమాలని హిందీలోకి రీమేక్ చేయడానికి బాలీవుడ్ నిర్మాతలు బాగా ఇంట్రస్ట్ చూపుతున్నారు. ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ భారీ హిట్టై వసూళ్ల వర్షం కురిపించడంతో.. తెలుగులో హిట్ అయిన ‘జెర్సీ, ఆర్ఎక్స్100’, ఎవడు సినిమాలను కూడా రీమేక్ చేస్తున్నారు.

కాగా మరొక తెలుగు సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా కూడా రీమేక్ అవుతుందట. బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ హీరోగా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. హీరో రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. మరి రణ్ వీర్ సింగ్ కి కూడా ఈ సినిమా సూపర్ హిట్ ని ఇస్తుందా..? చూడాలి. అన్ని కుదిరితే నవంబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందట. ఇక ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల గురించి, సినిమా వివరాల గురించి తెలియాల్సి ఉన్నాయి.