
సౌత్ స్టార్ హీరో తలపతి విజయ్ నటిస్తోన్న తాజా చిత్రం ‘మాస్టర్’ లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం టీజర్ ఇటీవల కోలీవుడ్ లో రిలీజ్ అయి రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తెలుగు టీజర్ విడుదల కోసం ఎదురుచూసిన విజయ్ అభిమానులకు సర్ప్రైజ్ రానే వచ్చింది. డిసెంబర్ 17న సాయంత్రం 6 గంటలకు మాస్టర్ టీజర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని బీఏ రాజు ట్విటర్ ద్వారా షేర్ చేశారు.
మాస్ యాక్షన్ థ్రిల్లర్ ను చూసేందుకు రెడీగా ఉండండి అంటూ క్యాప్షన్ ఇచ్చారు. మాస్టర్ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. విలన్ రోల్ లో మరో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది.