ఈ దీపావళి పండుగకు థియేటర్లో 'సరిలేరు నీకెవ్వరు’ తమిళ అనువాదం
ఈ దీపావళి పండుగకు థియేటర్లో 'సరిలేరు నీకెవ్వరు’ తమిళ అనువాదం

అన్ లాక్ ప్రక్రియలో భాగంగా సినిమా హాళ్లు కూడ తెరుచుకోవచ్చని కరేంద్ర ప్రభుత్వం చెప్పినా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఆ విషయమై పూర్తిస్థాయి నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి. కొన్ని చోట్ల థియేటర్లు ఓపెన్ అయినా ప్రేక్షకుల్ నుండి పెద్దగా స్పందన లేదు. అందుకే ప్రేక్షకులను థియేటర్ల వైపుకు నడిపించడానికి పెద్ద హీరోల సినిమాలు ఉంటె బాగుండేదని ఎగ్జిబిటర్ల ఆలోచన. అయితే ఇడుప్పటికిప్పుడు పెద్ద హీరోల కొత్త సినిమాలేవీ సిద్ధంగా లేవు. అందుకే లాక్ డౌన్ ముందు ఏవైతే వేయాలనుకున్నారో వాటినే వేస్తున్నారు.

 

 

తమిళనాడులో ఈ దీపావళి పండుగకు సినిమా హాళ్లు ఓపెన్ చేయాలని చూస్తున్నారు. అందుకే మొదటగా మహేష్ బాబు యొక్క సూపర్ హిట్ ‘సరిలేరు నీకెవ్వరు’ తమిళ అనువాదాన్ని ప్రదర్శించాలని డిసైడ్ అయ్యారు. ఈమేరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడ వచ్చేసింది. అంటే దీపావళికి తమిళనాడులో సందడి మొత్తం మహేష్ బాబుదే అన్నమాట. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటెర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. తెలుగులో ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టుకుంది.