Agent Sai Srinivasa Athreya Telugu Movie Review
Shruti Sharma, Ravi Varma, Naveen Polishetty ,Agent Sai Srinivasa Athreya ,Telugu Film Review

రేటింగ్ : 3.5/5
నటీనటులు : నవీన్ పోలిశెట్టి,శృతి శర్మ,సుహాస్ తదితరులు.
దర్శకత్వం : స్వరూప్ రాజ్ ఆర్ జె ఎస్
నిర్మాత : : రాహుల్ యాదవ్ నక్కా
సంగీతం : మార్క్ కె రాబిన్
స్క్రీన్ ప్లే : సన్నీ కూరపాటి
ఎడిటర్: అమిత్ త్రిపాఠి

కొన్ని సినిమాలు చూడడానికి చిన్న సినిమాలుగా అనిపించినా ..కంటెంట్ పరంగా ప్రామిసింగ్ గా కనిపిస్తాయి.అలా ఈ మధ్య కాలంలో కేవలం ట్రైలర్లతోనే టెర్రిఫిక్ రెస్పాన్స్ తెచ్చుకుని ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్న సినిమాగాహైప్ క్రియేట్ చేసుకుంది ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. ఈ సినిమా ట్రైలర్ ని దంగల్ డైరెక్టర్ నితీష్ తివారి లాంచ్ చెయ్యడం, ఆ ట్రైలర్ హ్యూమరస్ ప్లస్ ఇంటెలిజెన్స్ మిక్స్ గా ఉడడంతో భారీ అంచనాలు ఏర్పడి ఈ సినిమా గురించి కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారు. ‘బాగుంటుంది’ అనే ప్రీ రిలీజ్ టాక్ తో థియేటర్లలోకి వచ్చిన .ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అలరించాడా..? లేక బోర్ కొట్టించాడా అనేది చూద్దాం.

[INSERT_ELEMENTOR id=”3574″]

కథ:

నెల్లూరులో ఒక డిటెక్టివ్ గా తన ప్రయాణం మొదలు పెట్టిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ.. ముందు చిన్న చిన్న సిల్లీ కేసులను సాల్వ్ చేస్తుంటాడు.అయితే క్రైమ్ రిపోర్టర్ అయిన అతని ఫ్రెండ్ ద్వారా అన్ ఐడెంటిఫైడ్ బాడీస్ పై ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు.అలా ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ సాగుతుండగా ఆత్రేయను మర్డర్ కేస్ లో పోలీసులు అరెస్ట్ చేస్తాడు.అతనికి తెలీకుండానే అతనొక పెద్ద రిలిజియస్ క్రైమ్ గ్యాంగ్ పన్నిన వలలో చిక్కుకుంటాడు. ఎలాంటి క్లూస్ లేని స్టేజ్ లో ఇరుక్కున్న ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ తన చుట్టూ పన్నిన కుట్రను ఎలా ఛేదించాడు..? తన పై పెట్టిన అక్రమ కేసులనుంచి ఎలా బయటపడ్డాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటలు:

ఈ సినిమా స్క్రీన్ ప్లేలో సైతం ఇన్వాల్వ్ అయిన నవీన్ పోలిశెట్టి నటన..ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ అని చెప్పుకోవచ్చు.న్యాచురల్ బాడీ లాంగ్వేజ్ , క్యాజువల్ డైలాగ్ డెలివరీతో ఏజెుంట్ ఆత్రేయ పాత్రను అతను పోషించిన విధానం సింప్లీ సూపర్బ్. నవీన్ నేచురల్ బాడీ లాంగ్వేజ్ వల్ల,డిఫరెంట్ డైలాగ్ డెలివరీ వల్ల ..చాలా సాధా సీదా సన్నివేశాలు సైతం బాగా పండాయి.అతని పాత్ర కొన్ని పాతసినిమాలను గుర్తుకు తెచ్చినప్పటికీ ఈజీగానే కనెక్ట్ అయిపొయింది.హీరోయిన్ గా నటించిన శృతి శర్మ తనకిచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేసింది.కానీ ఆమె హీరో తో కలిసి అంత రిస్కీ ట్రావెల్ ఎందుకు చేసింది అనేదానికి మాత్రం ఎక్కడా సరయిన రీజనింగ్ ఇవ్వలేదు.మిగతా నటీనటులందరూ కొత్త వాళ్లే అయినా..నటనలో ప్రొఫెషనలిజాన్ని చూపించారు. ఆయా పాత్రలల్లో వాళ్లు తప్ప వేరే వాళ్లు చేసినా.. బావుండదు అన్నట్టుగా నటించి మెప్పించారు.

[INSERT_ELEMENTOR id=”3574″]

టెక్నీషియన్స్:

డైరెక్టర్ స్వరూప్ చాల చిన్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పాయింట్ ని థ్రిల్లింగ్ గా, ఎంటర్ టైనింగ్ గా ఉండే స్క్రీన్ ప్లేతో చాలా గ్రిప్పింగ్ గా నెరేట్ చేశాడు.కూల్ గా టేకాఫ్ అయిన సినిమా అరగంట తర్వాత అసలు గాడిలో పడుతుంది. అక్కడ నుంచి ప్రతి 20 నిమిషాలకు వచ్చే ఓ థ్రిల్లింగ్ ఎలిమెంట్ సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తుంది.ఫస్టాఫ్ లో కాస్త..ప్యాసివ్ నోట్ తో సాగడంతో బోర్ కొట్టినట్టు అనిపించినా.. సెకండాఫ్ లో మాత్రం ఊహించని మలుపులతో కొత్త పాయింట్ తో క్లైమాక్స్ కి చేరుకుంటుంది. డైరెక్టర్ గా, డైలాగ్ రైటర్ గా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ని సరైన రూట్ లో నడిపాడుదర్శకుడు స్వరూప్. కొత్త నటీనటులనుండి కూడా మంచి నటనను రాబట్టుకున్నాడు.అయితే చాలా చోట్ల కన్వీనియంట్ స్క్రీన్ ప్లే ఎంచుకున్నాడు.కానీ థ్రిల్ ని హోల్డ్ చెయ్యడం వల్ల ఆ లోపాలు పెద్దగా ఎలివేట్ కాలేదు.మార్క్. కె. రాబిన్ సంగీతం ఈ సినిమాకు మంచి సపోర్టింగ్ గా నిలిచింది.పాటలకు స్కోప్ లేకపోయినా..నేపథ్య సంగీతం మాత్రం కంటెంట్ కు కరెక్ట్ సింక్ లో ఉంటుంది.కొన్ని కొన్ని చోట్ల లెంగ్తీ సీన్స్ కూడా ఆర్.ఆర్ వల్ల నడిచిపోయాయి.సన్నీ సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది.లిమిటెడ్ బడ్జెట్ లో అన్ కాంప్రమైజ్డ్ అవుట్ పుట్ అందించడంలో సన్నీ కి కూడా మేజర్ షేర్ దక్కుతుంది.ఎడిటింగ్ బావుంది.నిర్మాణ విలువలు బావున్నాయి.మొదటి సినిమా ‘మళ్లీరావా’ తో అభిరుచి గల నిర్మాతగా పేరుతెచ్చుకున్న రాహుల్ యాదవ్ ఈ సినిమాతో మరోసారి తన అభిరుచి చాటుకున్నాడు.

ఫైనల్ గా:

చెప్పాలంటే .. ఆడుతూ, పాడుతూ జర్నీ మొదలు పెట్టిన .ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫస్టాఫ్ లో అక్కడక్కడా కాస్త విసిగించినా..ప్రీ క్లైమాక్స్ లో కొంచెం తడబడినా..ఓవరాల్ గా మెప్పించాడు. రొటీన్ గా రెగ్యులర్ గా సాగే సినిమాల్లా కాకుండ ఓ నావెల్టీ పాయింట్ ని తీసుకుని డిటెక్టివ్ బ్యాక్ డ్రాప్ జతచేసి చెప్పిన విధానం అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. .ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ కేవలం ప్రశంసలు మాత్రమే కాకుండా కాసులు కూడా రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

బోటమ్ లైన్:  ఏజెంట్ ఆత్రేయ…అలరిస్తాడు

[INSERT_ELEMENTOR id=”3574″]