‘లూసిఫర్’ లో చిరంజీవి చెల్లెల్లిగా రమ్యకృష్ణ
‘లూసిఫర్’ లో చిరంజీవి చెల్లెల్లిగా రమ్యకృష్ణ

మెగాస్టార్ చిరంజీవి సరసన స్టెప్పులు వేసి, తన నటనతో అదరగొట్టిన రమ్యకృష్ణ..ఇప్పుడు ఆయన సరసన సోదరిగా నటించబోతుందనే వార్త హల్ చల్ చేస్తోంది. చిరంజీవి రీమేక్ ఫిల్మ్ ‘లూసిఫర్’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

 

వివి వినాయక్  దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మలయాలంలో వచ్చిన ఈ సినిమాను తెలుగులో రీమెక్ చేస్తున్నారు. అందులో మోహన్ లాల్ హీరోగా కనిపించారు. అయితే..లూసిఫర్ మలయాళం వర్షన్ లో సోదరి పాత్ర కీలకంగా ఉంటుంది. మంజూ వారియర్ ఆ పాత్రలో అద్భుతంగా నటించారు.

 

సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకు ఈ పాత్ర కొనసాగనుంది. తెలుగులో చిరంజీవి సరసన…చెల్లెల్లిగా ఎవరిని నటించాలనే దానిపై దర్శకుడు తర్జనభర్జనలు పడుతున్నారట. చివరకు ఈ పాత్రకు రమ్యకృష్ణ అయితే..కరెక్టు అని భావిస్తున్నారని టాక్. చిరంజీవి – రమ్యకృష్ణ కాంబినేషన్ లో పలు సినిమాలు వచ్చాయి. ‘ఇద్దరు మిత్రులు, అల్లుడా మజాకా’ వంటి సినిమాల్లో హీరో, హీరోయిన్‌గా నటించారు.

 

చిరంజీవి పలు భారీ సినిమాలకు ప్లాన్స్ వేస్తున్నారు. కొరటాల శివ డైరక్షన్ లో ఆచార్య మూవీలో నటిస్తున్నారు. రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆచార్య తరువాత చిరంజీవి, మెహర్ రమేష్ తో ఒక చిత్రం, వివి వినాయక్ తో మరో చిత్రానికి అంగీకరించారు. ప్రస్తుతం లూసిఫర్ కు సంబంధించిన సినిమాకు స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయి. తాజాగా లూసిఫర్ లో చిరంజీవి సరసన చెల్లెల్లిగా రమ్యకృష్ణ..నటిస్తారా ? లేదా ? అనేది చూడాలి.