Pawan Kalyan Voice Over For Megastar Sye Raa-min
Pawan Kalyan Voice Over For Megastar Sye Raa-min

చిరంజీవి ప్రెస్టీజియస్ మూవీ సైరా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం కదిలివచ్చాడు.ఇది కేవలం భారీ బడ్జెట్ సినిమా అని మాత్రమే కాదు ఎప్పటినుండో చిరు చెయ్యాలి అనుకుంటున్న డ్రీం ప్రాజెక్ట్.అందుకే సినిమాలకు దూరంగా ఉన్న పవన్ మళ్ళీ డబ్బింగ్ థియేటర్ లో అడుగుపెట్టాడు.సైరా టీజర్ లో ఈ సినిమా కథని నెర్రేట్ చెయ్యడానికి పవన్ వాయిస్ ని ఛాయస్ గా అనుకున్నారు.పవన్ కూడా వచ్చి తన వాయిస్ అందించాడు.అదే టైం లో చిరంజీవి స్వయంగా పవన్ డబ్బింగ్ చెప్పడాన్ని పర్యవేక్షించాడు.

ఇక ఆ సినిమా డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా దగ్గర ఉండి మరీ డబ్బింగ్ చెప్పించుకున్నాడు.దానికి సంబందించిన ఒక మేకింగ్ వీడియో ని కూడా రిలీజ్ చేసి టీజర్ గురించి అందరూ ఎదురు చూసేలా హైప్ క్రియేట్ చేసారు.ఆ టీజర్ లో పవన్ ‘సైరా…నరసింహారెడ్డి’ అని అరిచే ఒక షాట్ ని కూడా యాడ్ చేసారు.అది చూసి తెగ సంబరపడుతున్నారు మెగాఫ్యాన్స్.అయితే ఈ సినిమా టీజర్ ని బట్టి ఈ సినిమా డీల్స్ అనేవి క్లోజ్ అవుతాయి.మరి అంత కీలకమయిన ఆ టీజర్ కి ఎలాంటి నెగెటివిటీ రాకుండా ఎలా కట్ చేసారో,నరసింహారెడ్డి ఇంట్రడక్షన్ ఎంత గ్రాండ్ గా ఉండబోతుందో అనే పాయింట్ అందరిలో ఉత్కంఠ కలిగిస్తుంది.