Chiranjeevi Sye Raa Movie trailer Review, Latest Movie News
Chiranjeevi Sye Raa Movie trailer Review, Latest Movie News

తెలుగు మొట్టమొదటి వీర విప్లవకారుడు “ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి” జీవితం ఆధారంగా మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం ట్రైలర్ ను ఈరోజు సాయంత్రం 5గం. 31ని. లకు విడుదలైంది. కాగా మొత్తానికి ట్రైలర్ అంచనాలకి తగ్గట్లుగానే భారీ విజువల్స్ తో బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మెగాస్టార్ స్క్రీన్ ప్రేజన్సీతో పాటు డైలాగ్ లు మిగిలిన భారీ తారాగణం గెటప్స్ అలాగే యాక్షన్ సీక్వెన్స్ స్ చాల బాగున్నాయి. ‘ఈ భూమి మీద పుట్టింది మేము, ఈ మట్టిలో కలిసేది మేము, నీకెందుకు కట్టాలిరా శిస్తు’ అని మెగాస్టార్ పలికిన డైలాగ్ తో పాటు ‘స్వతంత్రం కోసం జరుగుతున్న ఈ తొలి యుద్ధంలో నువ్వు గెలవాలి’ అంటూ అమితాబ్ బచ్చన్ చెప్పిన డైలాగ్ కూడా నెటిజన్లను బాగా అలరిస్తోంది.

కాగా అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐదు భాషల్లో భారీ ఎత్తున ఈ చిత్రం యొక్క హక్కులు అమ్ముడుపోయాయి. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలోనే పలు కొత్త రికార్డులు క్రియేట్ చేశారు మెగాస్టార్. పైగా ఇప్పుడు విడుదలైన ఈ సినిమా ట్రైలర్, సినిమా పై అమాంతం అంచనాలను పెంచేసింది. ఇక నిర్మాత రామ్ చరణ్ ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. రామ్ చరణ్ ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.