తెలంగాణలో తెరుచుకోనున్న సినిమా హాళ్లు ప్రారంభించాలని తెలంగాణ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయం

0
306
తెలంగాణలో తెరుచుకోనున్న సినిమా హాళ్లు ప్రారంభించాలని తెలంగాణ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయం
తెలంగాణలో తెరుచుకోనున్న సినిమా హాళ్లు ప్రారంభించాలని తెలంగాణ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయం

థియేటర్స్ ప్రారంభించాలని తెలంగాణ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించాలని థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుందని ఆశిస్తున్నట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. పార్కింగ్ రుసుము వసూలు చేసుకునే విధంగా ప్రభుత్వం అనుమతించాలని కోరారు. ప్రభుత్వాన్ని రాయితీలు కోరాలని అసోసియేషన్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.

 

దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే చర్యల్లో భాగంగా కేంద్ర హోంశాఖ ఇటీవలే మరిన్ని మినహాయింపులతో మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు/ మల్టీప్లెక్సులు తెరిచేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే, 50 శాతం సీట్ల సామర్థ్యంతో తెరిచేందుకు అనుమతిచ్చింది. అక్టోబర్‌ 15 నుంచి స్కూళ్లు తెరుచుకోవచ్చని, ఆ నిర్ణయాన్ని రాష్ట్రాలకు విడిచిపెట్టింది.

 

క్రీడాకారుల శిక్షణార్థం స్విమ్మింగ్‌ పూల్స్‌ తెరిచే వెసులుబాటు కల్పించింది. వినోద పార్కులు, సంబంధిత స్థలాలు మూసి ఉంచాలని స్పష్టంచేసింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో మాత్రం అక్టోబర్‌ 31 వరకు లాక్‌డౌన్‌ యథాతథంగా కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది.

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో దేశవ్యాప్తంగా సినిమా హాల్స్ మూత‌ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే అన్‌లాక్ 5.0లో భాగంగా సినిమా హాల్స్ ఓపెన్‌కు కేంద్రం అనుమ‌తి ఇచ్చింది.

Previous articleసైరా నరసింహారెడ్డి కు ఏడాది పూర్తి
Next articleడైహార్డ్ ఫ్యాన్‌ని సర్ ప్రైజ్ చేసిన బన్నీ