తెలుగులో నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు - డేవిడ్ వార్నర్
తెలుగులో నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు - డేవిడ్ వార్నర్

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కు క్రేజ్ ఒక్క మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా మన దక్షిణాది మరియు ఓవర్సీస్ మార్కెట్ లలో భారీ ఎత్తున కూడా ఉంది. ఆ మధ్య మహేష్ నటించిన లేటెస్ట్ చిత్రం “సరిలేరు నీకెవ్వరు” లోని మైండ్ బ్లాక్ సాంగ్ కు గాను ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మాస్ స్టెప్స్ వేసి ఆ మధ్య మంచి కిక్కిచ్చిన సంగతి తెలిసిందే. కేవలం అలా అనే కాకుండా మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టీం కు ఆడుతుండడంతో పాటుగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.

 

 

అలాగే మరిన్ని తెలుగు హీరోలపై వీడియోస్ చేసి ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేసిన వార్నర్ ఇప్పుడు ఇప్పుడు మన తెలుగులో తన ఫేవరెట్ హీరో మహేష్ బాబు అని తన ఐపీఎల్ టీం తో జరిపిన చిన్న చాట్ లో తెలిపాడు. దీనితో ఈ క్లిప్ చూసి మహేష్ ఫ్యాన్స్ మరింత గర్వంగా మరోసారి కాలర్ ఎగరేసేలా చేసారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనితో మహేష్ క్రేజ్ మామూలుగా మారలేదని చెప్పాలి. ప్రస్తుతం మహేష్ దర్శకుడు పరశురామ్ తో చేయనున్న సర్కారు వారి పాట చిత్రం షూట్ కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.