సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తీసే సినిమాలు దాదాపు అన్ని కాంట్రవర్సీ కథలు. ఎక్కువగా సమాజంలో జరుగుతున్న అంశాల పైన సినిమాలు తీసే ఆయన దిశ ఎన్కౌంటర్ పైన సినిమా తీస్తాను ఎప్పుడో ప్రకటించాడు. తెలంగాణలో జరిగిన దిశ (Disha Encounter) ఘటన ఆధారంగా తీస్తున్న మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. అలాగే నవంబర్ 26న ఈ మూవీ విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు.
అయితే నవంబర్ 26, 2019న దిషా సామూహిక అత్యాచారం మరియు హత్య మొత్తం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 4 మంది కుర్రాళ్ళు ఓ యువతిని లక్ష్యంగా చేసుకుని అత్యాచారానికి పాల్పడి ఆమెను దారుణంగా చంపారు. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత దిశ ఘటన పై సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవడానికి దిశ కేసులో నిందితుడైన చెన్నకేశవులు భార్యను కలిసిన వర్మ కలిసిన విషయం తెలిసిందే. మరి సినిమా ఎలా ఉంటుంది అనేది చూడాలి.