దొరసాని ట్రైలర్:పాత కథే కొత్తగా…

Anand Deverakonda, Shivathmika ,Dorasani Film Trailer
Anand Deverakonda, Shivathmika ,Dorasani Film Trailer

(Dorasani Trailer talk, upcoming movie starring Anand Devarakonda, younger brother of Vijay Devarakonda and Shivatmika)  దొరసాని…ఈ సినిమా టైటిల్ తోనే సినిమా లైన్ ని రిప్రెజెంట్ చేసిన డెబ్యూ డైరెక్టర్ మహేంద్ర టీజర్ అండ్ ట్రైలర్ లో కథని రివీల్ చేసాడు.ట్రైలర్ ప్రకారం చూస్తే ఇది చాలా పాత కథ.వెంకటేష్ ని స్టార్ హీరో గా నిలబెట్టిన బ్లాక్ బస్టర్ మూవీ చంటి కి మోడరన్ రీమేక్ లా ఉంది.పాత్రలు మారాయి తప్ప సోల్ పాయింట్ సేమ్.కాస్త కాస్త చిన్నాచితకా మార్పులు,తెలంగాణ నేటివిటీ తప్పిస్తే మిగతా సినిమా చూడకుండానే గెస్ చేసేలా ఉంది.

లవ్ స్టోరీస్ లో కథ ఎంత కొత్తగా ఉంది అనేకంటే కూడా ఎంత ఫీల్ వర్క్ అవుట్ అయ్యేలా చెప్పగలిగారు అన్న విషయంపైనే ఆ సినిమా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.సో,ఆ పాయింట్ ప్రకారం చూసుకుంటే మాత్రం దొరసాని కి సక్సెస్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు.లుక్స్ వరకు విజయ్ దేవరకొండని గుర్తు చేస్తున్న ఆనంద్ దేవరకొండ వాయిస్ కూడా విజయ్ లానే ఉంది.శివాత్మిక స్క్రీన్ ప్రెజెన్స్ స్టన్నింగ్ గా ఉంది.కళ్ళతో ఎక్సప్రెషన్స్ క్యారీ చేస్తూ ఆమె టాలెంట్ ఏంటి అనేది అప్పుడే చూపించేసింది.

మంచి పాత్రలు పడితే ఆమె హీరోయిన్ గా సెటిల్ అయిపోవచ్చు.తెలంగాణ పల్లె అందాలు మరొకసారి కనువిందుగా పంచేలా ఉంది దొరసాని.కొత్త డైరెక్టర్ మహేంద్ర ఎంచుకున్న పాయింట్ పాతగా ఉన్నా సినిమాని నడిపించిన విధానం కొత్తగా ఉంటుంది అంటున్నారు.ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న మేకర్స్ ఇస్మార్ట్ శంకర్ వదులుకున్న డేట్ ని రిలీజ్ డేట్ గా లాక్ చేసుకున్నారు.అలాగే రేట్లు కూడా కాస్త ఎక్కువగానే చెబుతున్నారట.ఇద్దరు కొత్త యాక్టర్స్ తో పాటు ప్రొడ్యూసర్స్ కి కూడా కంపల్సరీ హిట్ ఇవ్వాల్సిన బాధ్యత దొరసాని పై ఉంది.