jeevitha rajasekhar fire on maa association president Naresh
jeevitha rajasekhar fire on maa association president Naresh

(jeevitha rajasekhar fire on maa association president Naresh, Maa association latest updates)మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మరో వివాదం మొదలైంది . నిరంతర వివాదాలతో వార్తల్లో ఉండే మాలో ఇప్పుడు ఏకంగా అధ్యక్షుడిగా నరేశ్ ను తొలగించేస్తున్నారు . ఇందుకు అంతా సిద్దమైపోయిందట . త్వరలో ప్రకటన మాత్రమే మిగిలి ఉందని సినీ వర్గాల నుంచి సమాచారం వస్తోంది . అంటే నివురు గప్పిన నిప్పు మరోసారి రాజుకోబోతోందన్నమాట . మాలో ఎన్ని వివాదాలు , విబేధాలు ఉన్నాయో .. మొన్నటి ఓ కార్యక్రమంలో హీరో రాజశేఖర్ స్వయంగా చెప్పేశారు . పైకి అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నా .. అంతా లుకలకలే అని అందరి ముందు .. మీడియా ముందే రాజశేఖర్ స్పష్టం చేశారు . ఆరోజు ఆ సమావేశం చూసిన వారెవరైనా సరే .. మా లో ఎన్ని రాజకీయాలు ఉన్నాయో అర్థం చేసుకోగలరు .

ఈ సందర్భంగా జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ.. నరేష్ లోపాలను తప్పుబడుతూ క్రమశిక్షణ సంఘానికి 10 పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో 15 మంది ఈసీ కమిటీ సభ్యులు కూడా సంతకం చేశారు. గతంలో శివాజీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు.. నరేష్ కార్యదర్శిగా పనిచేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ వారు ఏం చేశారో.. అంతా ఈ 10 పేజీల లేఖలో పేర్కొన్నామన్నారు. దయచేసి క్రమ శిక్షణ సంఘం నరేష్‌ వ్యవహారంపై చర్చలు జరిపి సరైన చర్య తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన నరేష్‌పై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ సంఘానికి జీవిత విజ్ఞప్తి చేశారు.

మొత్తానికి ఈ విభేదాలు నరేశ్ ఉద్వాసనకు దారి తీసినట్టు తెలుస్తోంది . పైగా నరేశ్ ఓ సమావేశంలో మాట్లాడుతూ .. ” నేను వచ్చిన ఆరు నెలల్లోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేశాను . సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల అనుకున్నది చేయలేకపోయా . ‘ మా’లో ఆదిపత్యపోరు , వివాదాలు ఉన్న మాట వాస్తవమే . నా టర్మ్‌లో సంవత్సరం పూర్తైంది . మరో సంవత్సరం ఉంది . ‘ మా’ అధ్యక్ష పదవి నుంచి దిగిపోమ్మంటే ఈ క్షణమే దిగిపోడానికి సిధ్ధంగా ఉన్నాను .. అంటూ మాట్లాడటం కూడా పై అనుమానాలకు తావిస్తోంది . డిసిప్లెయిన్ కమిటీలో ప్రముఖ సీనియర్ నటులు కృష్ణం రాజు, మురళీమోహన్, మోహన్ బాబు, చిరంజీవి, జయసుధలు ఉన్నారు. దీనిపై మరి వారు ఎలా స్పందిస్తారో చూడాలి.