పవన్, రానా సినిమాకు ‘బిల్లా రంగా’ టైటిల్ ఖరారు

180
పవన్, రానా సినిమాకు ‘బిల్లా రంగా’ టైటిల్ ఖరారు
పవన్, రానా సినిమాకు ‘బిల్లా రంగా’ టైటిల్ ఖరారు

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ద‌గ్గుబాటి రానా ప్ర‌ధాన పాత్రల్లో మ‌ల‌యాళ హిట్ మూవీ ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియుమ్‌’ తెలుగులో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. సాగ‌ర్ కె.చంద్ర డైరెక్ష‌న్ లో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్క‌తున్న ఈ సినిమా నిన్న అధికారికంగా లాంఛ్ అయింది. ఈ చిత్రానికి ఎస్ థ‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రం కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ 40 రోజులు కేటాయించిన‌ట్టు తెలుస్తుంది.

 

 

ఇక ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన ఆసక్తికర టైటిల్స్ అన్ని  ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు ‘బిల్లా రంగా’ టైటిల్ ఖరారు చేసింది చిత్రబృందం. కాన్సెప్ట్ కు తగ్గట్లు ఈ సినిమాకి ‘బిల్లా రంగా’ టైటిల్ యాప్ట్ అవుతుందని భావించారు. ఇక బిల్లాగా ప‌వ‌ర్‌స్టార్, రంగాగా రానా నటించనున్నారు. కాగా 1982లో మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన ఈ క్లాసిక్ మూవీ అప్ప‌ట్లో పెద్ద హిట్ అయ్యింది.