ప్రభాస్ - నాగశ్విన్ సినిమా లో బిగ్ బి అమితాబ్ బచ్చన్
ప్రభాస్ - నాగశ్విన్ సినిమా లో బిగ్ బి అమితాబ్ బచ్చన్

ఇప్పుడు మన దేశంలోనే దాదాపు 1000 కోట్లకు పైగా విలువ చేసే ప్రాజెక్ట్ లు చేతిలో పెట్టుకున్న ఏకైక హీరోగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నిలిచాడు. అతను అధిగమించిన శిఖరాలకు తగ్గట్టుగానే ఈ హీరోకు అంతకు మించిన ఆఫర్లే ముందుముందు లైన్ లో ఉన్నాయి. అయితే ఇపుడు డార్లింగ్ చేస్తున్న మూడు భారీ ప్రాజెక్టులలో మోస్ట్ అవైటెడ్ కాంబో నాగశ్విన్ తో చేస్తుంది ఒకటి.

ఇంకా టైటిల్ కూడా అనౌన్స్ చెయ్యని ఈ భారీ ప్రాజెక్ట్ పై తారా స్థాయి అంచనాలు ప్రభాస్ ఫ్యాన్స్ పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే నాగశ్విన్ కూడా వారిని నిరాశ పరచకుండా సాలిడ్ అప్డేట్స్ ఇస్తూ మంచి కిక్కిస్తున్నారు. అలా నిన్న ఒక బిగ్ అప్డేట్ ను ఈరోజు రివీల్ చేస్తున్నామని ప్రకటించారు. ఇపుడు ఆ మోస్ట్ అవైటెడ్ అండ్ సాలిడ్ అప్డేట్ ను 10 గంటలకు రివీల్ చేసేసారు.

 

 

ఈ భారీ చిత్రంలో ఇండియన్ లెజెండరీ నటులు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఒక భాగం అన్నట్టుగా రివీల్ చేసారు. ఈ లెజెండరీ సినిమాలో అలాంటి లెజెండ్ లేకుండా ఎలా అని ఈ బిగ్గెస్ర్ అనౌన్సమెంట్ ను రివీల్ చేసారు. ఈ భారీ చిత్రాన్ని నాగశ్విన్ ఒక స్కై ఫై థ్రిల్లర్ గా తెరకెక్కించనుండగా ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తుంది. టాలీవుడ్ లెజెండరీ నిర్మాత అశ్వనీ దత్ ఈ చిత్రాన్ని 500 కోట్లకు పైగా వ్యవయంతో అత్యున్నత ప్రామాణికాలతో తెరకెక్కించనున్నారు.