బిగ్ బాస్4 ఫైనల్ చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన షో బిగ్ బాస్. ఈ షో అత్యంత టీఆర్‌పీ రేటింగ్ నమోదు చేసిన షోగా రికార్డుకెక్కింది. అయితే ఈ షో ప్రస్తుతం నాలుగో సీజన్‌ జరుగుతోంది. ఇందులోని కంటెస్టెంట్ల గొడవలు, మాటలు, లవ్ ట్రాక్‌లతో పాటు బిగ్ బాస్ ఇచ్చే టాస్క్‌లతో షో మరింత రసవత్తరంగా సాగుతోంది. ఈ షోకు ఉన్న ఫ్యాన్ బేస్ అంతా ఇంతా కాదు. ప్రతి వారం దాదాపు 84 శాతం మంది ప్రజలు ఈ ఫోను వీక్షిస్తున్నారు. అయితే ఇటీవల ప్రేక్షకుల మదిలో ఓ సందేహం వచ్చింది.

 

 

ప్రతి సీజన్ ఫైనల్‌కు ఓ ప్రత్యేకమైన తార చీఫ్ గెస్ట్‌గా వస్తారు. అయితే ఈ సీజన్‌కు ఎవరు వస్తారు అని ప్రశ్న రేకెత్తింది. దానిపై అనేక చర్చలు కూడా జరిగియి. కొందరు యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ వస్తాడని, మరికొందరు ప్రిన్స్ మహేష్ బాబు వస్తాడని, ఇంకొందరైతే మెగాస్టార్ చిరంజీవి రానున్నారిన అన్నారు. దీనిపై ఒక చిన్నపాటి యుద్దమే జరిగినట్లయింది.

 

 

- Advertisement -

ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 4కి రానున్న చీఫ్ గెస్ట్ ఖరారు అయ్యారు. చీఫ్ గెస్ట్‌గా నాగార్జునాతో వేదికను పంచుకొని షోలో విజేతను ప్రకటించేందుకు సిద్దంగా ఉన్నారు. అయితే రానుంది ఎన్‌టీఆర్ కాదు, అలాగని మహేష్ కూడా కాదు. ఈ సీజన్ విజేతను ప్రకటించనుంది మెగాస్టార్ చిరంజీవి. బిగ్ బాస్ వేదికపై కనిపించి అభిమానులకు కనుల విందు చేయనున్నారు.

 

 

అయితే ఈ షో ప్రస్తుతం ఉత్కంఠ బరితంగా కొనసాగుతోంది. ఎవరు గెలుస్తారని అభిమానులు వెర్రెక్కిపోతున్నారు. తమ అభిమాను కంటెస్టెంట్ గెలుస్తారా లేదా టీవీలకు అతుక్కుపోయి చూస్తున్నారు. మరి ఈ షోలో ఎవరు గెలుస్తారో తెలియాలంటే ఫైనల్ ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

Related Articles

Telugu Articles

Movie Articles