‘బుట్టబొమ్మ’ ను వదిలేలా లేరుగా..!

Allu Arjun and Pooja Hegde's Butta Bomma song new record

Allu Arjun Butta Bomma: కొన్ని పాటలు అంతే ఒక్కసారి వింటే చాలు… వినాలని అనిపిస్తూనే ఉంటుంది. అలాంటి పాటలు ఇటీవలి కాలంలో చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. ఆ కోవలోకి చెందినవే ‘అల వైకుంఠపురంలో’ సినిమా లోని పాటలు..! ముఖ్యంగా బుట్టబొమ్మ సాంగ్ ను మన వాళ్ళు అసలు వదలలేకపోతున్నారు. పెళ్లి అయినా అదే.. డ్యాన్స్ అయినా ఆ పాటే.. చివరికి హాయిగా చిల్ అవ్వాలన్నా ఆ పాటనే..! ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్స్ లోనే కాదు.. యూట్యూబ్ లో కూడా ఈ పాటను తెగ చూసేస్తూ ఉన్నారు. మొదట లిరికల్ వీడియో వైరల్ అవ్వగా.. ఇప్పుడు వీడియో సాంగ్స్ కూడా అంతే ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి.

‘బుట్టబొమ్మ’ వీడియో సాంగ్ 100 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకునే వీడియో సాంగ్స్ చాలా తక్కువగా ఉంటాయి. 10 కోట్ల మంది ఓ పాటను చూశారంటే అది చిన్న విషయం కాదు. ఈ పాటకి 1 మిలియన్ లైక్స్ కూడా లభించాయి. సాంగ్ లో మ్యూజిక్, లిరిక్స్ ఈ పాటను ఓ ఎత్తుకు తీసుకుని వెళ్లగా.. పూజ హెగ్డే క్యూట్ నెస్, అల్లు అర్జున్ వేసే స్టెప్స్ ఈ పాటకు మరింత పాపులారిటీని సంపాదించిపెట్టాయి. ఇతర చిత్ర పరిశ్రమలకు చెందిన సెలెబ్రిటీలు కూడా ఈ పాటకు ఫ్యాన్స్ అయ్యారంటే ఏ రేంజిలో అందరినీ ఫిదా చేసిందో అర్థం చేసుకోవచ్చు. శిల్పా శెట్టి లాంటి ప్రముఖులు కూడా ఈ పాటకు డ్యాన్స్ చేశారంటే ఎంతగా అందరి మనసులలోకి ఈ పాట చొచ్చుకు వెళ్లిందో తెలిసిపోతుంది.

ఈ మధ్యనే బాలీవుడ్ నటి దిశా పటానీ కూడా అల్లు అర్జున్ డ్యాన్స్ ను సోషల్ మీడియాలో తెగ మెచ్చుకుంది.. అంత బాగా డ్యాన్స్ ఎలా చేయగలుతున్నారు సార్ అంటూ అల్లు అర్జున్ ను మెచ్చుకుంటూ.. బుట్టబొమ్మ పాటకు సంబంధించిన వీడియోను తన ఫాలోవర్స్ తో పంచుకుంది. బన్నీ కూడా ఆమె పెట్టిన పోస్టుకు స్పందించారు. ‘నాకు మ్యూజిక్‌ అంటే చాలా ఇష్టం. అలా మంచి మ్యూజిక్‌ నాతో డ్యాన్స్‌ చేయిస్తుంది. మీ ప్రశంసకు ధన్యవాదాలు’ అని చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. డ్యాన్స్‌ లో మాకు స్ఫూర్తిగా ఉన్నందున థ్యాంక్యూ అంటూ బన్నీకి బదులిచ్చింది.