‘మహాసముద్రం’ లో ‘కేజీఎఫ్’ గరుడ ఫస్ట్ లుక్ పోస్టర్

0
28
KGF's Garuda Ram In And As Dhanunjay In Maha Samudram Poster

కన్నడ నటుడు రామచంద్రరాజు కేజీఎఫ్‌లో మెయిన్ విలన్ గరుడగా తన అద్భుతమైన ప్రదర్శనతో దేశవ్యాప్తంగా ఖ్యాతిని పొందారు. ఈ క్రమంలో ఇతర భాషల్లో కూడా వరుస అవకాశాలు అందుకుంటున్న గరుడ రామ్.. ఇప్పుడు ”మహాసముద్రం” సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తున్నాడు.

అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘ధనుంజయ్’ అనే శక్తివంతమైన పాత్రను గరుడ రామ్ పోషిస్తున్నాడు. తాజాగా అతని పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. మహా సముద్రం షూటింగ్ చివరి దశలో ఉంది. చివరి షెడ్యూల్ మాత్రమే పెండింగ్‌లో ఉంది.

అదితి రావు హైడారి, అను ఇమ్మాన్యుయేల్ హెరొఇనెస్ కాగా, జగపతి బాబు, రావు రమేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ‘మహాసముద్రం’ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు.

KGF's Garuda Ram In And As Dhanunjay In Maha Samudram Poster