మహేష్, త్రివిక్రమ్ ల కాంబో మళ్లీ వస్తుందా ?

185
మహేష్, త్రివిక్రమ్ ల కాంబో మళ్లీ వస్తుందా ?
మహేష్, త్రివిక్రమ్ ల కాంబో మళ్లీ వస్తుందా ?

మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన సినిమా అతడు. అనుకున్నంత స్థాయిలో రానించకపోయినా ఇప్పటికీ హిట్‌గానే నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా బుల్లి తెరపై వస్తే అందరు స్క్రీన్‌లకు అతుక్కుని చూస్తారు. అయితే అతడు తరవాత వీరి కాంబోలో వచ్చిన ఖలేజా సినిమా కూడా అదే పంథాలో థియేటర్లలో ప్లాప్ అయినా, బుల్లితెరపై వస్తే చాలు పనులు మానుకొని మరీ ఈ సినిమా చూస్తారు. దాంతో వీరి కాంబోను అభిమానులు మళ్లీ కోరుకోవడం వింతేమీ కాదు.

 

 

అభిమాను ఈ కాంబోను కోరుకుంటున్నారని హీరో మహేష్‌కు, దర్శకుడు త్రివిక్రమ్‌కు తెలుసు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వీరి కాంబో ముడిపడటంలేదు. వీరిద్దరు తమతమ సినిమాలలో బిజీగా ఉన్నారు. దాంతో ఎదరుచూపులు చూసి చూసి అభిమానులు విసిగెత్తి దాని గురించి కూడా మర్చిపోయారు. అయితే ఇటీవల మహేష్ తమ కాంబో మళ్లీ ఉంటుందని చెప్పి అభిమానుల్లో ఆశలు రేకెత్తంచాడు.

 

 

మరి ఈ కాంబో ఎప్పడు వస్తుందనేది, అసలు వస్తుందా లేదా అనేది ఇంకా ఫైనల్ అవ్వలేదు. అయితే ఒకవేల వస్తే ఈ కాంబో రావడానికి మరో రెండు సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంది. అంటే బహుశా 2022లో వీరి కాంబోలో సినిమా ప్రారంభించవచ్చు. అయితే వీరిద్దరిలో ఎవరు కూడా ఒక్క అడుగు ముందుకు వేయడం లేదు. అభిమానులకు మళ్లీ నిరాశ ఎదురయ్యే అవకాశం కూడా లేకపోలేదు. దీనిపై క్లారిటీ కోసం ఇంకొన్నాళ్ళు ఎదురు చూడాల్సిందే.