మహేష్ సినీ పరిశ్రమకు వచ్చి ఇప్పటికి 41 సంవత్సరాలు ముగిసాయి

0
265
మహేష్ సినీ పరిశ్రమకు వచ్చి ఇప్పటికి 41 సంవత్సరాలు ముగిసాయి
మహేష్ సినీ పరిశ్రమకు వచ్చి ఇప్పటికి 41 సంవత్సరాలు ముగిసాయి

మహేష్ బాబు ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. అమ్మాయిలకు కలల రాకుమారుడు. ఎప్పటికీ యవ్వనంగానే ఉంటాడు. ఇటీవల సితారతో షాపింగ్ వచ్చిన మహేష్‌ను చూసి అందరూ అది గౌతమ్ అనుకున్నారు. అయితే మహేష్ సినీ పరిశ్రమకు వచ్చి ఇప్పటికి 41 సంవత్సరాలు ముగిసాయి.

 

 

ఈ సందర్భంగా మహేష్ అభిమానులు సోషల్ మీడియాను పోస్టులపై పోస్టులు పెట్టి తమ అభిమానాన్ని తెలుపుతున్నారు. ప్రస్తుతం మహేష్ 41 సంవత్సారాల ప్రస్థానంపై రూపొందించిన సీడీపీ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ సీడీపీలో ఓ పెద్ద భవనం దాని పక్కనే మహేష్ మైనపు బొమ్మ చూస్తే ఇట్టే ఆకట్టుకునేలా తయారు చేశారు.

 

 

అయితే మహేష్ తన సినీ జీవితాన్ని 1979లో దర్శకరత్న దాసరి నారాయణరావు డైరెక్షన్‌లో నీడ సినిమాతో మొదలు చేశాడు. ఈ సినిమాలో మహేష్ బాలనటుడిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ సినిమా విడుదలయ్యి ఈ ఏడాదదికి 41 సంవత్సారాలు కానున్నాయి. ఇప్పటి వరకు ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్‌ల తరువాత మెగాస్టార చిరంజీవి, బాలకృష్టా మాత్రమ పరిశ్రమలోకి వచ్చి 40 సంవత్సారాలను పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో మహేష్ చేరాడు.

 

మహేష్ నీడ సినిమా తరువాత తండ్రి కృష్ణ, సోదరుడు రమేష్ బాబుతో కలిసి పోరాటం, శంఖారావం, కొడుకు దిద్దిన కాపురం, గూఢాచారి 117, బజారు రౌడీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించాడు. అప్పట్లోనే మహేష్ రెండు పాత్రలను చేసి అందరిని ఆకట్టుకున్నాడు. తనకు పది సంవత్సారాలు కూడా రాకముందే పరిశ్రమలో ప్రతేక గుర్తింపును తెచ్చుకున్నాడు.

 

ఆ తరువాత కే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో 1998లో రాజకుమారుడు సినిమాతో మహేష్ హీరోగా తన మొదటి సినిమాను విడుదల చేశాడు. ఆ సినిమా భారీగా హిట్ అవ్వడంతో తండ్రికి తగ్గ తనయుడని పేరు తెచ్చుకున్నాడు. మూడో సినిమా మురారీలో తనదైన నటనతో అందరిని అలరించాడు. దాంతో మహేష్‌కు నంది అవార్డు కూడా వచ్చింది. దాని తర్వాత కౌబాయ్‌గా అందరిని అదరగొట్టాడు. అది తన నాల్గవ సినిమా టక్కరి దొంగతో అందరి మనసుల్ని దొంగలించాడు.

 

అప్పటినుంచి మహేష్ సినీ జీవితం దూసుకెళ్లింది. ఆ తరువాత ‘నిజం’ చెప్పి మరో నందిని తన ఖాతాలో వేసుకున్నాడు. ‘అతడు’ సినిమాతో హాలీవుడ్ హీరోలా ఎంతో స్మార్ట్ అండ్ హ్యాండ్స్‌మన్‌గా కనిపించాడు. వెంటనే ‘పోకిరీ’లో తన మాస్ యాంగిల్‌ను చూపి అందరికి బుల్లెట్లు దించాడు. అంతేకాకుండా మహేష్ జీవితంలో పోకిరీ చాలా ప్రత్యేకం. ఆ సినిమాతోనే మహేష్ తన డైలాగ్ చెప్పే తీరును పూర్తిగా మార్చేశాడు.

 

 

 పోకిరీ పరిశ్రమకు మరో మహేష్‌ను పరిచయం చేసింది. ఆ తరవుత ‘బిజినేస్ మ్యాన్’లా కనిపించి, బాక్సాఫీస్ వద్ద భారీగా బిజినెస్ చేశాడు. వెంటనే సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టులో తనలో ఇంకా ఫామిలీ యాంగిల్ పోలేదని నిరూపించుకున్నాడు.

 

 

ఇక వరుసగా శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరూ సినిమాలతో బాక్స్‌ఆఫీస్‌ను కుదిపేశాడు. శ్రీమంతుడు తరువాత ఎక్కవగా సామాజిక సందేశం ఇచ్చే సినిమాల్లోనే కనిపించాడు. ప్రస్తుతం మహేష్ పరుశురామ్ దర్శవత్వంలో సర్కారు వారి పాట సినిమాలో చేస్తున్నాడు.