“మాస్టర్” తెలుగు టీజర్ కి 1 మిలియన్ వ్యూస్

259
“మాస్టర్” తెలుగు టీజర్ కి 1 మిలియన్ వ్యూస్
“మాస్టర్” తెలుగు టీజర్ కి 1 మిలియన్ వ్యూస్

ఇళయ థలపతి విజయ్ హీరోగా లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా “మాస్టర్”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అయితే ఒక్క తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా గ్రాండ్ రిలీజ్ కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

అంతకు ముందు వచ్చిన “విజిల్”, “సర్కార్” సినిమాలతో మంచి క్రేజ్ ను కూడా విజయ్ సొంతం చేసుకున్నాడు. అలా ఇప్పుడు ఈ సినిమా తెలుగు వెర్షన్ టీజర్ ను విడుదల చెయ్యగా దానికి కూడా గట్టి రెస్పాన్స్ నే అందిస్తున్నారు. వ్యూస్ మరియు లైక్స్ పరంగా అతి తక్కువ సమయంలోనే లక్షల్లో అందిస్తున్నారు.

 

సో తెలుగులో విజయ్ కు మరో మంచి వెల్కమ్ దక్కేలా ఉంది అనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఒక పవర్ ఫుల్ విలన్ రోల్ లో కనిపిస్తున్నాడు. ఇక అలాగే ఈ చిత్రంలో మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని తెలుగులో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ వారు విడుదల చేస్తున్నారు.