రజినీకాంత్ దర్బార్‌ మూవీ రివ్యూ

2404
Darbar movie overseas audience review & Live updates
Darbar movie overseas audience review & Live updates

విడుదల తేదీ : జనవరి 09, 2020
రేటింగ్ : 2.5/5
నటీనటులు : రజిని కాంత్,సునీల్ శెట్టి, నయనతార, నివేదా థామస్ తదితరులు
దర్శకత్వం : ఏ ఆర్ మురుగదాస్
నిర్మాత‌లు : ఏ. శుభాస్కరన్
సంగీతం : అనిరుధ్ రవిచంద్రన్
సినిమాటోగ్రఫర్ : సంతోష్ శివన్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్

తమిళ్ తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా ఏ ఆర్ మురుగ దాస్ ల కాంబినేషన్ లో సంక్రాంతి పండుగను మొదటగా స్టార్ట్ చేసిన స్టైలిష్ కాప్ డ్రామా చిత్రం “దర్బార్”. ప్రపంచ వ్యాప్తంగా మంచి బజ్ నడుమ ఈ చిత్రం ఈరోజు నాలుగు భాషల్లో విడుదల అయ్యింది. రజినీ ఫాన్స్ అంతా చాలా రోజుల నుంచి ఓ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కోసం వెయిటింగ్. మరి ఆ కోరికని తీర్చే రేంజ్ లో ఉందో? లేదో? అనేది ఇప్పుడు చూద్దాం..

కథ:

ముంబై పోలీస్ కమిషనర్ ఆదిత్య అరుణాచలం (రజినీకాంత్) నగరంలో ఉన్న గ్యాంగ్‌స్టర్స్, రౌడీ షీటర్లను ఒక్కొక్కరిగా చంపుతూ ఉంటాడు. పిచ్చిపట్టినట్టు వాళ్లందరినీ ఎన్‌కౌంటర్ చేస్తూ ఉంటాడు. ‘మ్యాడ్ కాప్’ అంటూ ఆయనపై మీడియాలో రకరకాల కథనాలు వెలువడతాయి. ఇదే నేపథ్యంలోమెయిన్ విలన్ హరి చోప్రా(సునీల్ శెట్టి) పేరు మోసిన డాన్ గా ఒక మాఫియాను నడిపిస్తుంటాడు.అయితే కథలో ఈ ఇద్దరికీ ఉన్న సంబంధం ఏమిటి?వీరిద్దరికీ ఏమన్నా ఫ్లాష్ బ్యాక్ ఉందా?అస్లు సునీల్ శెట్టి ఏం చేస్తుంటాడు.? ఈ కథలో నివేతా థామస్ పాత్రకు ఎలాంటి ప్రాముఖ్యత ఉంది?మొట్టమొదటి సారి రజినీను మురుగదాస్ ఎలా చూపించారు అన్నది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

రజినీకాంత్ అదిరిపోయే పెర్ఫామెన్స్
కొన్ని ఎలివేషన్ సీన్స్

మైనస్ పాయింట్స్ :

రొటీన్ స్టోరీ
అంత ఆసక్తిగా సాగని స్క్రీన్ ప్లే

విశ్లేషణ :

తన అభిమానులకు అసలుసిసలైన మాస్ ఎంటర్‌టైనర్‌ను అందించట్టానికి మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ఈ సంక్రాంతికి కూడా వాడారు తలైవా. థ్రిల్లర్, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో కూడిన పక్కా మాస్ ఎంటర్‌టైనర్ ‘దర్బార్’. థియేటర్‌కి వచ్చే సగటు ప్రేక్షకుడు ఏమి ఆశిస్తాడో అన్నీ చూపించేశారు ఈ సినిమాలో. కథ కొత్తగా ఏమీ లేదు. పాత స్టోరీ లైనే. కాకపోతే దానికి మంచి స్క్రీన్‌ప్లేను జతచేసి తెరపై ఆవిష్కరించారు దర్శకుడు మురుగదాస్. మాములుగా రజిని అంటేనే స్టైల్ కు కేరాఫ్ అడ్రెస్ అలాంటి రజినీను మళ్ళీ చాలా కాలం తర్వాత తండైన వింటేజ్ లుక్స్ లోనూ అలాగే తన డైలాగ్ మాడ్యులేషన్ తో అప్పటి కొన్ని డైలాగ్స్ ను మురుగదాస్ పలికించి తలైవర్ ఫ్యాన్స్ కు మంచి కిక్కిస్తారు.

రజినీ వన్ మేన్ షోతో ఒక స్టైలిష్ మాస్ పోలీస్ ఆఫీసర్ గా రజినీ ఫ్యాన్స్ ఆయన్నుంచి ఏం కోరుకుంటారో అవన్నీ ఉండేలా రజినీ నుంచి దర్శకుడు మురుగదాస్ రాబట్టారు.అంతే కాకుండా ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని ఎలివేషన్ సీన్స్ కానీ అలాగే అక్కడ స్టార్ కమెడియన్ యోగిబాబు మరియు రజినీల మధ్య కామెడీ ట్రాక్స్ బాగుంటాయి. చట్టానికి అతీతంగా ఒక పోలీస్ ఆఫీసర్ ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో చూపించారు. రజినీ ఎంట్రీ సీన్ మొదలుకొని సినిమా మొత్తం ఆదిత్య అరుణాచలం పాత్రను ఇలాగే తీర్చిదిద్దారు. మానవ హక్కుల సంఘం అధికారిణితో అరుణాచలం ప్రవర్తించిన తీరు కూడా కొంత మంది ప్రేక్షకులతో చప్పట్లు కొట్టిస్తుంది.

అలాగే రజినీ మరియు నయనతారల మధ్య కెమిస్ట్రీ కానీ ఇలా అంతా డీసెంట్ గా కథనం సాగిపోతుంది.అయితే మాములుగా మురుగదాస్ అంటే ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు కూడా కొన్ని ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.వాటిని ఫస్ట్ హాఫ్ లో మురుగదాస్ అందుకోలేకపోయారు. ఫస్టాఫ్ రేసీ స్క్రీన్ ప్లేతో చాలా వేగంగా సాగిపోతుంది. ముంబై కమిషనర్‌గా ఛార్జ్ తీసుకున్న వెంటనే పెద్ద బిజినెస్‌మేన్ కొడుకు అజయ్ మల్హోత్ర (ప్రతీక్ బబ్బర్)ను అరెస్టు చేయడం, ఆ అరెస్టు తరవాత నడిచిన డ్రామా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ఒక ట్విస్ట్ వస్తుంది.

చిత్రంలోని మరే ఇతర అంశాలు అంత గొప్పగా అన్పించకపోవచ్చు.అయితే ఫస్ట్ హాఫ్ సోసోగా ఉంది అనుకుంటే సెకండాఫ్ అంతా హరి చోప్రా (సునీల్ శెట్టి), ఆదిత్య అరుణాచలం మధ్య నడిచే ఆట, వేట. అంత కొత్తదనం ఏమి ఉండదు.రెగ్యులర్ కాప్ డ్రామాలానే అనిపిస్తుంది.ఇది కాస్త నిరాశ కలిగించే అంశమే అని చెప్పాలి.కథానుసారం వచ్చే ఫైట్స్,ఎమోషనల్ సీన్స్ , రజిని మార్క్ ఎలివేషన్ సీన్స్ బాగానే ఉంటాయి. సెకండాఫ్‌లో సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యింది. తండ్రీకూతుళ్లుగా రజినీ, నివేద థామస్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. నివేద నటన ప్రతి ఒక్కరితో కంటతడి పెట్టిస్తుంది.

లోకల్ రైల్వే స్టేషన్‌లో ఫైట్ సీన్ రజినీ అభిమానులతో ఈలలు వేయిస్తుంది. ఇక హాస్పిటల్‌లో రజినీ, నివేద మధ్య సన్నివేశాలు ఏడిపిస్తాయి. సినిమాలో కామెడీ కూడా బాగానే పండింది. రజినీ, యోగిబాబు మధ్య వచ్చే సన్నివేశాలు నవ్విస్తాయి. సినిమా మొత్తం రజినీ మేనరిజం కూడా నవ్వు తెప్పిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా రజినీ అభిమానులకు ఫుల్ మీల్స్. మిగిలిన ప్రేక్షకులు ఈ సంక్రాంతికి చూడదగిన సినిమా.