Venky Mama Review and Rating, Box office collections,
Venky Mama Review and Rating, Box office collections,

వెంకీ మామ తెలుగు మూవీ రివ్యూ:
విడుదల తేదీ : డిసెంబర్ 13, 2019
రేటింగ్ : 2.75/5
నటీనటులు : వెంకటేష్ నాగచైతన్య, పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నా, నాజర్, ప్రకాష్ రాజ్, విద్యుల్లేఖ రామన్, రావు రమేష్, దాసరి అరుణ్ కుమార్, చమ్మక్ చంద్ర తదితరులు
దర్శకత్వం : కె ఎస్ రవీంద్ర(బాబీ)
నిర్మాత‌లు : సురేష్ బాబు, టి జి విశ్వప్రసాద్
సంగీతం : ఎస్ ఎస్ థమన్

విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య హీరోలుగా నటించిన మల్టీస్టారర్ సినిమా.. వెంకీ మామ. నిజ జీవితంలో మామా అల్లుళ్లు అయిన వీరిద్దరు వెండితెరపైనా మామా అల్లుళ్లుగా నటించారు. ఎఫ్2 తర్వాత వెంకటేశ్ నటించిన ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఫ్యామిలీ ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే ఈ దగ్గుబాటి హీరో కామెడీ, యాక్షన్ సీన్లతో కావాల్సినంత వినోదాన్ని అందిస్తాడు.

విక్టరీ వెంకటేష్ మరియు నవ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్యలు హీరోలుగా రాశి ఖన్నా మరియు పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్లుగా కె ఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీ స్టారర్ చిత్రం “వెంకీ మామ”. ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

కథలోకి వెళ్లినట్టయితే కార్తీక్(నాగ చైతన్య) తన చిన్న వయసులోనే తన తల్లిదండ్రులను పోగొట్టుకుంటాడు.దానితో కార్తీక్ భాధ్యతను అతని మావయ్య వెంకట రత్నం(వెంకటేష్)తీసుకుని తన జీవితం మొత్తం కార్తీక్ కోసమే త్యాగం చేస్తాడు. కార్తీక్ కోసం పెళ్లి కూడా చేసుకోకుండా తన జీవితం మొత్తం కార్తీక్ హ్యాపినెస్ కోసమే త్యాగం చేస్తాడు. అది తెలిసిన కార్తీక్ ఎలాగైనా తన మామయ్య పెళ్లి చెయ్యాలనే ఉద్దేశ్యంతో స్కూల్ టీచర్ వెన్నెల (పాయల్ రాజ్ పుత్)కు వెంకట రత్నం మధ్య ప్రేమ పుట్టించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఇటు వెంకట రత్నం కూడా కార్తీక్ ప్రేమించిన హారిక (రాశి ఖన్నా)ను ఒప్పించి కార్తీక్ ను హారికను కలపాలని ట్రై చేస్తాడు.

ఆ తరువాత జరిగిన కొన్ని ఊహించని పరిణామాల అనంతరం కార్తీక్ తన మామయ్యకు శాశ్వతంగా దూరమయిపోవటానికి ఆర్మీలోకి వెళ్ళిపోతాడు. మిలటరీ లో జాయిన్ అయ్యాక ఏం అయింది? మేనల్లుడిని వెతుక్కుంటూ వెళ్ళిన మావయ్యా తిరిగి మేనల్లుడిని కలిశాడా? అసలు వీళ్ళకి గొడవ ఎందుకు అయింది. ఇలాంటివన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇవి కాకుండా సినిమాలో మరిన్ని ఉపకథలు ఉన్నాయి, అవి థియేటర్స్ లో చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

వెంకీ మరియు చైతూల పెర్ఫామెన్స్
ఫస్ట్ హాఫ్ లోని కామెడీ ట్రాక్స్

మైనస్ పాయింట్స్ :

స్క్రీన్ ప్లే
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగా ఎక్కువగా చూపించడం

పెర్ఫార్మెన్స్:

వెంకటేష్ మరియు నాగ చైతన్య ల పెర్ఫార్మెన్స్ అద్బుతంగా ఉంది, ముఖ్యంగా వెంకీ దుమ్ము లేపేశాడు, కామిక్ టైమింగ్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ రాఫ్ఫాడించాడు. ఇక నాగ చైతన్య కి మరీ అద్బుతమైన రోల్ దొరకలేదు కానీ ఉన్నంతలో ఓకే అనిపించుకున్నాడు. హీరోయిన్స్ గా నటించిన రాశి ఖన్నా – పాయల్ లవ్ సీన్స్ లో అవలీలగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకున్నారు. ఎమ్మెల్యేగా నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించిన రావు రమేష్, తాతయ్యగా నాజర్ ఎప్పటిలాగే తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో మెప్పించారు. ఇక మిగిలిన నటీనటుల్లో హైపర్ ఆది కామెడీ అక్కడక్కడా వర్కౌట్ కాగా మిగిలిన రోల్స్ పరిది మేర ఉంటాయి.

ఇక సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయం లో తమన్ కుమ్మేశాడు, 2 పాటలు మాస్ కి ఫీస్ట్ గా ఉండగా ఫైట్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో ఉంది, ముఖ్యంగా ఇంటర్వెల్ ఫైట్ సీన్ ఓ రేంజ్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు తమన్, ఎడిటింగ్ బాగుంది గాని, ఆసక్తికరంగా సాగని కొన్ని సీన్స్ ను ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది.

ఇక డైరెక్షన్ పరంగా. బాబీ సక్సెస్ కాలేక పోయాడు. దర్శకుడు బాబీ రాసుకున్న కామెడీ ట్రీట్మెంట్, ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ.. ఆర్మీ సీన్స్ లో లాజిక్ మిస్ అవ్వడం, అలాగే కొన్ని కీలక సన్నివేశాల్లో ఇంట్రస్ట్ మిస్ అవ్వడం వంటి అంశాలు మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. అయితే ఈ చిత్రంపై ప్రేక్షకులు తప్పకుండ మంచి అంచనాలను పెట్టుకోని ఉంటారు.కానీ ఆ అంచనాలను రీచ్ అవ్వడానికి బాబీ చేసిన ప్రయత్నం మరింత అర్ధవంతంగా ఉండి ఉంటే మరింత బాగుండేది.ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడికి ఇన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఏంటి?అన్న ఆలోచన రాకమానదు.ఒకటి అయితే మరొకటి ఒకదాంట్లోనే మరొకటి ఇలా తరచు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ల మీదే చిత్రాన్ని బాబీ నడిపించినట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో చైతు పాత్రకి సంబదించిన ట్రాక్ ఇంకా ఎఫక్టీవ్ గా చూపించి ఉంటే బాగుండేది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయతే వెంకీ మరియు చైతుల కాంబో లో తెరకెక్కిన “వెంకీ మామ”తో వచ్చిన ఈ ఇద్దరు మామ అల్లుళ్ళు ప్రేక్షకులను బాగానే మెప్పించారని చెప్పొచ్చు. సరదాగా మంచి ఫన్ తో సాగుతూ కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో పాటు కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడా బాగానే ఆకట్టుకుటుంది. ఇద్దరి స్క్రీన్ ప్రెజన్స్ మరియు బలమైన ఎమోషన్స్ మెయిన్ హైలైట్ అవ్వగా సరైన స్క్రీన్ ప్లే లేకపోవడం మూలాన ఎక్కువగా ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ను హ్యాండిల్ చెయ్యకపోవడం కాస్త నిరాశ పరుస్తుంది. కామన్ ఆడియన్స్ ఒకసారి చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఒకసారి చూసే విధంగా సినిమా ఉంది. ఇక ఫ్యాన్స్ ని ఫుల్ గా సాటిస్ ఫై చేయకున్నా ఉన్నంతలో కొద్ది వరకు మెప్పిస్తుంది ఈ సినిమా..