Sandeep Ninu Veedani Needanu Nene Also Releasing Tamil, Film Review
Sandeep Ninu Veedani Needanu Nene Also Releasing Tamil, Film Review

సందీప్ కిషన్…కాస్త మహేష్ బాబు ని అనుకరిస్తాడు అనే విషయం పక్కనబెడితే మరీ హీరో మెటీరియల్ గా సరిపోని క్యాండిడేట్ అయితే కాదు.ఛోటా.కె.నాయుడు సందీప్ కిషన్ ని హీరోగా నిలబెట్టడానికి కష్టపడ్డాడు అనే విషయం కూడా అందరికి తెలిసిందే.కాకపోతే సందీప్ కిషన్ కి ఉన్న పెద్ద డిస్ అడ్వాంటేజ్ స్క్రిప్ట్ సెలెక్షన్.

[INSERT_ELEMENTOR id=”3574″]

తనకి తానుగా ఎంచుకున్న స్క్రిప్ట్స్ లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తప్ప వేరే ఏ సినిమా కూడా హిట్ అనిపించుకోలేకపోయింది.అదే టైం లో సందీప్ కిషన్ తమిళ్ లో కూడా సినిమాలు చేసాడు.దాంతో అక్కడా అనుకున్నంత మైలేజ్ రాక,ఇక్కడ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాక మధ్యలో నిలబడ్డాడు.హీరోగా హిట్ అనేది అనివార్యం అయిన టైం లో తానే ప్రొడ్యూసర్ గా కూడా మరి ‘నిను వీడని నీడను నేనే’ అనే సినిమా చేసాడు.ఇక్కడి వరకు బాగానే ఉంది.కానీ మళ్ళీ అదే సినిమాను ‘కన్నాడి’ పేరుతో తమిళ్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు.ఇలా రెండు పడవల ప్రయాణం మాత్రం ఆపలేదు.కాకపోతే ఆ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.వెన్నెల కిషొర్ సేవియర్ పాయింట్ లా కనిపిస్తున్నాడు.అతని క్రేజ్ వల్ల ఈ సినిమా మంచి రేట్లకు అమ్ముడు పోయింది.

[INSERT_ELEMENTOR id=”3574″]

అయితే ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ అమ్మేసాం,అగ్రిమెంట్ సైన్ చేసాం లాంటి బజ్ క్రియేట్ టెక్నిక్స్ ఎటూ వాడుతున్నారు.టెక్నికల్ గా కూడా ఈ సినిమా హై స్టాండర్డ్స్ లో ఉన్నట్టు ఉంది.కాకపోతే ఇప్పటికే తెలుగు వాళ్ళు హారర్ కామెడీ సినిమాలు చూసి,నవ్వి నవ్వి అలసిపోయి ఉన్నారు.సో,సినిమా హిట్ అవ్వాలంటే సినిమాలో బలమయిన ఎలిమెంట్ ఎదో ఉండి ఉండాలి.అది లేకపోతే ఈ సినిమాపై ఆశలు వదిలేసుకోవచ్చు.ఈ సినిమాతో హిట్ వస్తే సందీప్ కిషన్ కి మరో లైఫ్ వచ్చినట్టే.ఇది కూడా ఫట్ అంటే సందీప్ ఇన్నింగ్స్ ఆల్మోస్ట్ ఎండింగ్ కి వచ్చినట్టే.మరి దొరసాని,రాజ్ దూత్ లతో కలిసి ఈ శుక్రవారం డు ఆర్ డై పోరుకి రెడీ అవుతున్న సందీప్ లక్కు ఎలా ఉంటుందో చూడాలి.