సర్కారు వారి పాట లో విలన్ గా అరవింద స్వామి
సర్కారు వారి పాట లో విలన్ గా అరవింద స్వామి

మహేష్ బాబు – పరుశురామ్ దర్శకత్వంలో రానున్న సినిమా ‘సర్కారు వారి పాట’. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ గా తమిళ్ హీరో అరవింద స్వామి నటించబోతునట్లు తెలుస్తోంది. అరవింద స్వామికి తెలుగులో కూడా క్రేజ్ ఉంది. మొదట కన్నడ హీరో ఉపేంద్రను విలన్ గా అనుకున్నారు. ఉపేంద్ర ఈ సినిమాలో విలన్ అంగీకరించలేదట. అందుకే అరవింద స్వామిని తీసుకున్నారని తెలుస్తోంది.

ఇక భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ సాగుతోందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని.. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అన్నదే మెయిన్ పాయింట్ అని తెలుస్తోంది. అన్నిటికి మించి చాలా కాలం తర్వాత మహేష్ ఈ సినిమాలో లవర్ బాయ్‌ గా కనిపించబోతున్నాడు.

 

కాగా ఈ లవర్ బాయ్ లుక్ కోసమే, మహేష్ తన హెయిర్ స్టైల్ ను కూడా కొత్తగా మార్చుకున్నాడు. ఇప్పటికే మహేష్ మార్చిన కొత్త లుక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాగా మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. కరోనా లేకపోయి ఉండి ఉంటే.. ఈ పాటికే షూటింగ్ సగం పూర్తయిపోయేది.