సెప్టెంబర్ 25 తెలుగు చిత్ర పరిశ్రమకు బ్లాక్ డే .. గతేడాది వేణు మాధవ్.. ఇప్పుడు బాలసుబ్రమణ్యం
సెప్టెంబర్ 25 తెలుగు చిత్ర పరిశ్రమకు బ్లాక్ డే .. గతేడాది వేణు మాధవ్.. ఇప్పుడు బాలసుబ్రమణ్యం

సెప్టెంబర్ 25.. ఇకనుంచి ఈ తేదీ గుర్తొస్తే చాలు కచ్చితంగా టాలీవుడ్ విషాదంలో మునిగిపోతుంది. దానికి కారణం ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం మాత్రమే కాదు.. మరోటి కూడా ఉంది. సరిగ్గా ఇదేరోజు ఇద్దరు లెజెండరీ పర్సనాలిటీస్ మనకు దూరమైపోయారు. ఏడాది కింద ఇదే రోజు టాలీవుడ్ పూర్తి విషాదంలో మునిగిపోయింది. అందరి కంటా కన్నీరు కనిపించింది. ఎవర్ని కదిపినా కూడా మాటరాని మౌనమే ఉంది. దానికి కారణం వేణు మాధవ్ మరణం. సెప్టెంబర్ 25, 2019న ఈయన అనారోగ్యంతో మరణించాడు . తెలుగు ఇండస్ట్రీలో మంచి కమెడియన్‌గా దాదాపు 400 సినిమాలకు పైగా నటించాడు

 

 

సరిగ్గా పోయిన సంవత్సరం ఇదే రోజు అంటే సెప్టెంబర్ 25, 2020న ఏకంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం లాంటి లెజెండ్ మనకు దూరం అయిపోయాడు. ఒకేరోజు.. ఇద్దరు దిగ్గజాలు ఇలా మరణించడం నిజంగానే విషాదం. అది కూడా ఒకేరోజు ఉండటంతో తెలుగు చిత్ర పరిశ్రమకు సెప్టెంబర్ 25 నిజంగానే కలిసిరాలేదు ఒకే తేదీన ఇలా ఇద్దరూ లెజెండ్స్ మరణించడంతో తెలుగు ఇండస్ట్రీ ఈ డేట్ చూస్తేనే కన్నీరు పెట్టుకుంటుంది.. కోపంతో మండి పడుతుంది. ఒకరు తెలుగు ఇండస్ట్రీపై తన కామెడీతో బలమైన ముద్ర వేసారు.. మరొకరు ఇండియన్ సినిమా సంగీతంపై చెరగని ముద్ర వేసారు. అలాంటి వాళ్లిద్దరూ ఒకే తేదీన మరణించడం విషాదకరం.