సైరా నరసింహారెడ్డి కు ఏడాది పూర్తి
సైరా నరసింహారెడ్డి కు ఏడాది పూర్తి

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన హిస్టారికల్ ఫిల్మ్.. ‘సైరా నరసింహారెడ్డి’..

 

బిగ్ బి అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించగా.. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

 

అక్టోబర్ 2, 2019న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ చిత్రం విడుదలై ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రామ్‌ చరణ్‌ ట్విట్టర్‌ వేదికగా ‍స్పందించారు. సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి గా కృతజ్ఙతలు తెలిపారు. ‘బెస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌, బెస్ట్‌ క్రూ, ఏ బ్రిలియంట్‌ టీం, థ్యాంక్యూ వన్‌ అండ్‌ ఆల్‌’ అని చెర్రీ ట్వీట్‌ చేశారు.