‘హర హర వీరమల్లు’ సినిమాలో హైలైట్ పాయింట్స్

0
68
Huge Agra fort set in making for Pawan Kalyan Hari Hara Veera Mallu

Hari Hara VeeraMallu: పవన్ కళ్యాణ్ వరుసపెట్టి భారీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టారు. అందులో ఒకటే క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘హర హర వీరమల్లు’. శరవేగంగా షూటింగ్ జరిపి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్న క్రిష్..

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు క్రిష్ భారీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దాదాపు 150 కోట్లతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మొగల్ చక్రవర్తుల కాలం నాటి కథ కళ్ళకు కట్టినట్లుగా ఉండేలా భారీ సెట్స్ వేస్తున్నారట. కథపై ఉన్న నమ్మకంతో నిర్మాత ఎ.ఎం రత్నం కూడా ఖర్చు విషయంలో వెనకాడటం లేదని అంటున్నారు. 

అందులో భాగంగా ప్రస్తుతం ఈ సినిమా కోసం ఆగ్రా కోట సెట్టింగ్ వేయిస్తున్నారట. ఈ ఒక్క సెట్టింగ్ కోసం 10 కోట్లు వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.  జులై నెలలో ఈ సినిమా షూటింగ్ అక్కడే జరుగుతుందని అంటున్నారు. సినిమాలోని కీలక సన్నివేశాలను అందులో చిత్రీకరించేందుకు గాను అన్ని విధాలుగా మెరుగులు దిద్దుతున్నారు.

ఇందులో పవన్ ఫైట్ సీక్వెన్స్‌లు చిత్రీకరించనున్నారట. ఇక్కడ షూట్ చేయబోయే సన్నివేశాలే సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ ఆరో మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో కనిపించబోతున్నారు.

పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఎప్పుడు టచ్ చేయని జోనర్ ఇది. కనుక అభిమానులు క్రిష్ పై చాలా నమ్మకంతో ఎదురు చూస్తున్నారు.