ఎన్టీయార్ భీమ్ కి టీజర్ 100 మిలియన్ వ్యూస్

366
100M ViewsFor Bheem Intro
100M ViewsFor Bheem Intro

దర్శక దిగ్గజం రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ విడుదలకు ముందే సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. భీమ్ ఇంట్రో టీజర్ వివిధ సోషల్ మీడియా మాధ్యమాలలో వంద మిలియన్ వ్యూస్ ను అందుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులు సోషల్ మీడియాలో వివరంగా తెలియ చేస్తున్నారు.

 

 

‘ట్రిపుల్ ఆర్’ లోని భీమ్ పాత్రధారి ఎన్టీయార్ ఇంట్రోను తెలియచేస్తూ విడుదల చేసిన ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ కు ఐదు భారతీయ భాషల్లో కలిపి యూట్యూబ్ లో 64.49 మిలియన్ వ్యూస్, ఫేస్ బుక్ లో 28.24 మిలియన్ వ్యూస్, ఇన్ స్టాగ్రామ్ లో 7.37 మిలియన్ వ్యూస్ దక్కాయి.

 

 

దాంతో మొత్తంగా 100 మిలియన్ వ్యూస్ దక్కిన సందర్భంగా ఎన్టీయార్ అభిమానులు #100MViewsForBheemIntro అనే హ్యాష్ ట్యాగ్ తో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 13న జనం ముందుకు రాబోతోంది. మరి అప్పుడు ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.