తెలంగాణలో 100 శాతం థియేటర్స్ ఆక్యుపెన్సీ

0
301
100-perecent-occupancy-allowed-in-telangana-theaters
100-perecent-occupancy-allowed-in-telangana-theaters

గ‌తేడాది అక్టోబ‌ర్‌లోనే థియేటర్లు తెరుచుకోవ‌డానికి అనుమ‌తి ఇచ్చినా.. ఇప్ప‌టి వర‌కూ కేవ‌లం 50 శాతం కెపాసిటీతోనే న‌డ‌ప‌డానికి అనుమ‌తి ఉండేది. ఇటివలే కేంద్రం ఫిబ్ర‌వ‌రి 1 నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు న‌డుపుకోవ‌చ్చ‌ని చెప్పింది. ఈ మేర‌కు కేంద్ర స‌మాచార‌, ప్ర‌సారాల మంత్రిత్వ శాఖ‌ కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది.

 

 

అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా 100 శాతం ఆక్యుపెన్సీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈమేరకు జీవో జారీచేసింది. సినిమాలు, థియేట‌ర్లు, మ‌ల్టీప్లెక్స్‌ల‌లో 100 శాతం సీట్ల‌ను నింపుకోవ‌డానికి అనుమ‌తి ఇస్తున్న‌ట్లు అందులో స్ప‌ష్టం చేసింది. ప్రస్తుత నిర్ణయంతో థియేటర్ ఓనర్లు, నిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Previous articleనెట్‌ఫ్లిక్స్‌ “పిట్ట కథలు” ట్రైలర్
Next articleఫిబ్ర‌వ‌రి 19న అల్ల‌రి న‌రేష్ ‘నాంది’ సినిమా