Pushpa 2 theatrical rights: అల్లు అర్జున్ (Allu Arjun) అలాగే సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2 షూటింగ్ దస లో ఉంది. గత కొన్ని రోజులుగా పుష్ప 2 థియేట్రికల్ రైట్స్ కోసం 1000 కోట్ల డీల్ గురించి చాలా వార్తలు వచ్చాయి, కానీ వాస్తవానికి దానికి భిన్నంగా కనిపిస్తోంది. పుష్ప 2కి (Pushpa 2) హిందీ నుంచి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయన్నది నిజమే కానీ తమిళం, కన్నడం, మలయాళం భాషల విషయంలో అదే చెప్పలేం కానీ నిజం కావచ్చు.
Pushpa 2 theatrical rights: తెలుగులో కూడా, పుష్ప మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూళ్లు రాబట్టకపోవడంతో పుష్ప 2 (Pushpa 2) కోసం డిస్ట్రిబ్యూటర్లు కొనటానికి అంత తొందర పడటం లేదు. ఈ చిత్రానికి ప్రతి భాషలో విపరీతమైన క్రేజ్ ఉందని నిరూపించడానికి పుష్ప బృందం లేదంటే కొన్ని మీడియా సంస్థలు మాత్రమే ఫేక్ బజ్‌ని సృష్టించడానికి ప్రయత్నిస్తుందా?.. అందుకే థియేట్రికల్ రైట్స్‌కి రికార్డ్ ధరల గురించి ఈ రకమైన వార్తలు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయా..? తెలియాల్సి ఉంది.
2021 డిసెంబర్‌లో విడుదలైన అల్లు అర్జున్ (Allu Arjun) మరియు సుకుమార్‌ల పుష్ప ది రైజ్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది మరియు ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ చిత్రం హిందీలో ఆశ్చర్యకరమైన విజయాన్ని సాధించింది, అలాగే నార్త్ ఆడియన్స్ పుష్ప (Pushpa 2) సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాబట్టి సుకుమార్ అండ్ టీమ్ పుష్ప ది రూల్‌ని మొదటి భాగం కంటే ఎక్కువగా అలాగే భారీగా చూపించడానికి అన్ని ప్రయత్నాల్లో ఉన్నట్టు ప్రచారం అయితే జరుగుతుంది.
ఈ మధ్యే పుష్ప సీక్వెల్ థియేట్రికల్ రైట్స్ (Pushpa 2 theatrical rights) కోసం అల్లు అర్జున్ 1000 కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి. కొన్ని బాలీవుడ్ ట్రేడ్ సర్కిల్‌లు అలాగే మీడియా సంస్థలు ఈ వార్తల్ని ప్రసారం చేశాయి.. RRR మూవీ థియేట్రికల్ రైట్స్ అన్ని భాషలలో కలిపి రూ. 900 కోట్లకు పైగా వసూలు చేసిందని.. ఇప్పుడు పుష్ప 2 (Pushpa 2) కోసం అల్లు అర్జున్ 1000 కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నాడని పలు మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి.
పుష్ప 2 సంబంధించిన ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అల్లు అర్జున్ అభిమానులకు అలాగే నచ్చని వారి మధ్య కామెంట్ల రూపంలో గొడవలు అయితే జరిగాయి. అయితే మేము పైన చెప్పిన విధంగా 1000 కోట్ల డీల్ అయితే జరగలేదు.. కొన్ని మీడియా ఛానల్స్ మాత్రమే ప్రచారం చేశాయి.. అలాగే పుష్ప 2 సంబంధించిన థియేట్రికల్ రైట్స్ బిజినెస్ ఇంకా పూర్తి కాలేదు. మరి కొన్ని రోజుల్లో పూర్తి సమాచారం అందిస్తాము.