Tollywood Drugs Case KP chowdary, Sureka Vani: కేపీ చౌదరి అరెస్ట్ అయిన క్షణం నుంచి టాలీవుడ్ లో హై టెన్షన్ మొదలైంది. ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాక కొందరి గుండెల్లో గుబులు పట్టుకుంది. కేపీ చౌదరి రెండు రోజులు పాటు పోలీసుల కస్టడీలోకి తీసుకున్న తర్వాత చాలామంది పనైపోయింది అన్న టాక్ ప్రస్తుతం టాలీవుడ్ లో అక్కడక్కడ వినిపిస్తోంది.
Tollywood Drugs Case KP chowdary phone call list: మొదట్లో ఇవి కేవలం అపోహలే అని కొట్టి పడేసిన.. ప్రస్తుతం డ్రగ్ సప్లయర్ కేపీ చౌదరి కాల్ లిస్టులో నుంచి 12 మంది టాలీవుడ్ హీరో హీరోయిన్ల కాంటాక్ట్ లిస్ట్ ను పోలీసులు వెలికి తీశారు. ఈ 12 మందిలో ముఖ్యంగా ఒక హీరోయిన్ మరియు ఒక ఐటమ్ సాంగ్ స్పెషల్ హీరోయిన్ ఎన్నో వందలసార్లు కేపీతో మాట్లాడినట్టు ట్రాక్ రికార్డు ఉంది.
పోలీసుల విచారణలో ఈ విషయం గురించి ప్రశ్నించినప్పుడు కేపీ చౌదరి అడ్డదిడ్డమైన సమాధానాలు ఇచ్చి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడట. తాను ఒక నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ కాబట్టి నటీనటులతో తరచుగా మాట్లాడాల్సి ఉంటుందని అందులో తప్పేంటి అంటూ పోలీసుల్ని రివర్స్ ప్రశ్నిస్తున్నాడని తెలుస్తోంది. అయితే తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది అన్న విషయాన్ని మాత్రం కేపీ చౌదరి ప్రస్తుతానికి స్పష్టంగా ఒప్పుకున్నారు.
తన దగ్గర పట్టుబడిన అన్ని డ్రగ్స్ కేవలం తను వాడడం కోసమే గోవా నుంచి ప్రత్యేకంగా తెప్పించుకున్నానని.. టాలీవుడ్ లో ఎవరికీ సరఫరా చేయాల్సిన అవసరం తనకు లేదని చెప్పుకొచ్చాడు. అయితే కేపీ పట్టుబడిన సమయంలో మిస్ అయిన రెండు ప్యాకెట్లు ఏమయ్యాయి అన్న ప్రశ్నకు మాత్రం మౌనమే సమాధానంగా మిగిలింది. పోలీసుల దర్యాప్తులో బయటపడిన కేపీ అకౌంట్ లోని 11 అనుమానాస్పదంగా ఉన్న ట్రాన్సాక్షన్స్ గురించి అడిగినప్పుడు కూడా అతను సగం సగం సమాధానమిచ్చి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది.

కేపీ రెండు రోజుల కస్టడీ ముగియడంతో అతని తిరిగి చర్లపల్లి జైలుకు తరలించారు. దర్యాప్తు అనంతరం పోలీసులు పూర్తిస్థాయిలో ఆధారాలను కోర్టుకు సమర్పించి మరొకసారి తిరిగి కెపిని కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కేపీ కాలనీలో ఉన్న యాక్టర్స్ అందరికీ సమన్లు జారీ చేయబోతున్నట్లు సమాచారం.