కేజీఎఫ్ ఛాప్టర్ 2: ఒక్క క్లైమాక్స్ సీన్ కోసం రూ.12 కోట్ల

351
12cr-spent-for-kgf-chapter-2-massive-climax-scene
12cr-spent-for-kgf-chapter-2-massive-climax-scene

పాన్ ఇండియా చిత్రాలలో కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా మొదటి భాగం సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా రెండో భాగం కూడా సిద్దమైపోయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ యశ్ హీరోగా ఈ సినిమా వస్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన సినిమా టీజర్ కూడా రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

 

 

అయితే ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలలో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రంలోని క్లైమాక్స్ ఎంత కీలకమో తెలిసిందే. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ చేసిన అధీరా పాత్రకు మరియు రాకీ భాయ్‌కు ఉండే భీకర పోరాట సన్నివేశం ఏ స్థాయిలో ఉంటుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఈ ఒక్క క్లైమాక్స్ సీన్ కోసమే నిర్మాణ సంస్థ హోంబలె వారు భారీ ఎత్తున ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. మాసివ్‌గా డిజైన్ చేసిన ఈ సన్నివేశానికి గాను రూ.12 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. అలాగే ఈ చిత్రానికి రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు అయ్యినట్టు తెలుస్తుంది.