నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తన తదుపరి సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కొన్ని నెలల క్రితం నవీన్ మేడారం దర్శకత్వంలో డెవిల్ సినిమాని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. మరియు ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మరో క్రేజీ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా హైదరాబాదు లొకేషన్స్ లో జరుగుతోంది. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ దాదాపు 3 కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందంట. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ స్పెషల్ నంబర్ కోసం విలాసవంతమైన సెట్‌ను నిర్మించారని తెలుస్తుంది. ఈ పాటను వైబ్రెంట్‌గా రూపొందించాలని టీమ్ భావించడంతో, మేకర్స్ పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయించి సాంగ్ షూట్ కంప్లీట్ చేసినట్టు కూడా సమాచారం.
అందమైన బాలీవుడ్ బ్యూటీ ఎల్నాజ్ నొరౌజీ బృందా మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన తన సిజ్లింగ్ డ్యాన్స్ మూవ్స్‌తో డ్యాన్స్ ఫ్లోర్‌ను అదిరిపోయింది అంటున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ పాట సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
నవీన్ మేడారం దర్శకత్వం వహించిన ఇది తెలుగు, హిందీ, తమిళం మరియు కన్నడ భాషలలో హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో రిచ్ బడ్జెట్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందించబడుతుంది. శ్రీకాంత్ విస్సా కథ, మాటలు రాశారు. సౌందరరాజన్ సినిమాటోగ్రఫీని నిర్వహించనున్నారు.
3 crores budget for Kalyan Ram Devil song, Kalyan Ram Next movie shooting updates, Kalyan Ram new movie updates, Kalyan Ram Devil Movie shooting updates, Devil Shooting location, Devil Movie cast crew details