3 Tollywood Movies To Remake Bollywood Version, Latest News
3 Tollywood Movies To Remake Bollywood Version, Latest News

[INSERT_ELEMENTOR id=”3574″]

బాలీవుడ్ తెలుగు సినిమాలను చూసి ఆశ్చర్యపోవడం అనేది బాహుబలి తోనే మొదలయ్యింది.అయితే ఆ తరువాత కూడా మన మేకర్స్,ముఖ్యంగా యంగ్ డైరెక్టర్స్ ఫ్రెష్ థాట్స్ తో సినిమాలు తీస్తూ సక్సెస్ ల కొడుతున్నారు.రీసెంట్ గా వచ్చిన కబీర్ సింగ్ అయితే ఒరిజినల్ వెర్షన్ ని తీసిన డైరెక్టర్ తప్ప వేరే ఎవరూ దానికి న్యాయం చెయ్యలేరు అని మూడు వందలకోట్ల వసూళ్ల సాక్షిగా ప్రూవ్ చేసింది.దాంతో ఇప్పుడు తెలుగు సినిమాల రీమేక్ గురించే కాదు,ఒరిజినల్ వెర్షన్ ని తీసిన డైరెక్టర్ కూడా ఉండాలి అనే ఆలోచన కూడా చేస్తున్నారు.

కబీర్ సింగ్ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది.దీంతో ఇప్పడు మరొక తెలుగు బాలీవుడ్ లో రీమేక్ అవుతుంది.అదే జెర్సీ.నాని హీరోగా తెరకెక్కిన ఈ క్రికెట్ బ్యాక్ డ్రాప్ మూవీ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ లా ఆడియన్స్ ని ఫ్లాట్ చేసింది.తండ్రి-కొడుకుల మధ్య వచ్చే సీన్స్ కి ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లాయి.అందుకే ఈ సినిమాని మన తెలుగు ప్రొడ్యూసర్స్ అయిన అల్లు అరవింద్ ఆండ్ దిల్ రాజు కలిసి హిందీ లో రీమేక్ చెయ్యబోతున్నారు.ఎప్పటినుండో దిల్ రాజు బాలీవుడ్ లో సైతం బోణీ కొట్టాలని వెయిటింగ్.జెర్సీ తో అరంగేట్రం చేస్తున్నాడు.తెలుగులో ఈ సినిమాని నిర్మించిన సితార ఎటెర్టైన్మెంట్స్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంది.అయితే ఈ సినిమాకు డైరెక్టర్ గా తెలుగు సినిమా తీసినా గౌతమ్ నే ఎంచుకున్నారు.ఈ సినిమాలోని ఎమోషన్ కి బాలీవుడ్ కూడా ఫిదా అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

ఎప్పటినుండో హిట్ కోసం ఎదురుచూస్తున్న సందీప్ కిషన్ కి ఊరట ఇస్తూ,ప్రొడ్యూసర్ గా అతని తొలిప్రయత్నం కూడా కలసివచ్చేలా డీసెంట్ సక్సెస్ అందుకున్న సినిమా నిను వీడని నీడను నేనే.ఈ సినిమాని తక్కువ బడ్జెట్ లో,రిచ్ అవుట్ ఫుట్ ఉండేలా తియ్యడంతో ఇక్కడ లాభాలు సంపాదించి పెడుతుంది.అలాగే హారర్ సినిమా అయినా కూడా సినిమాలో పాయింట్ కొత్తగా ఉండడం,ఈ తరహా సినిమాలు అక్కడ హిట్ అవుతుండడంతో నిను వీడని నీడను నేనే కూడ బాలీవుడ్ లో రీమేక్ అవుతుంది.స్త్రీ తో భారీ హిట్ అందుకున్న ప్రొడ్యూసర్స్ ఈ సినిమాని అక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారు.ఇలా జోనర్ తో సంబంధం లేకుండా కేవలం పాయింట్ కొత్తగా ఉండడంతో తెలుగు సినిమాలు అక్కడ వాళ్ళు దంచేస్తున్నాయి.ఈ రెండు సినిమాలు కూడా హిట్ అయితే మరిన్ని తెలుగు సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అవ్వడం ఖాయం.

[INSERT_ELEMENTOR id=”3574″]