ప్రభాస్ రాధే శ్యామ్ క్లైమాక్స్ కోసం 30 కోట్లతో 4 సెట్స్ ..?

‘సాహో’ తర్వాత ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ప్యాన్‌ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్‌’. ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. నటుడు కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్నారు.

ఇటీవల ఇటలీలో కీలక సన్నివేశాలు పూర్తి చేసుకుని ఇండియాకి తిరిగొచ్చిన ‘రాధేశ్యామ్‌’ చిత్రబృందం త్వరలోనే హైదరాబాద్‌ షెడ్యూల్‌కి సిద్ధమవుతోంది. ఈ షెడ్యూల్‌లో క్లైమాక్స్‌ కోసం దాదాపుగా 30 కోట్ల ఖర్చుతో ప్రత్యేకంగా పాతకాలపు ఇటలీని పోలిన నాలుగు వేర్వేరు సెట్లను రామోజీ ఫిల్మీ సిటీలో ఏర్పాటు చేశారు. మేకర్స్ ఈ నాలుగు సెట్లలో క్లైమాక్స్ భాగాన్ని షూట్ చేయబోతున్నారు మరియు వాస్తవానికి సినిమాకు సరిపోయే ఒక క్లైమాక్స్ భాగాన్ని ఖరారు చేయవచ్చు. నిజానికి యాక్షన్‌ పార్ట్‌ కన్నా ప్రేమకథ ఎక్కువ ఉంటుందని ఇటీవల ఓ సందర్భంలో ప్రభాస్‌ పేర్కొన్నారు.

హాలీవుడ్‌ మూవీ ‘గ్లాడియేటర్‌’కి యాక్షన్‌ కొరియోగ్రఫీ అందించిన నిక్‌ పోవెల్‌ ‘రాధేశ్యామ్‌’కి వర్క్‌ చేస్తున్నారు. ఆయన పర్యవేక్షణలోనే ఈ సినిమా క్లైమాక్స్‌ యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. యూరోప్ నేపథ్యంలో సాగే ప్రేమకథగా తెరకెక్కనున్న ఈ సినిమాలో క్లైమాక్స్‌ భారీ స్థాయిలో చిత్రీకరించాలని దర్శకుడు రాధాకృష్ణ ప్లాన్ చేస్తున్నారు. ఈ కోవలోనే ఆఖరి పోరాట సన్నివేశాల కోసం ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేస్తుండటం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Show comments

Related Articles

Telugu Articles

Movie Articles