Homeసినిమా వార్తలుభార్య విషయంలో 30 ఇయర్స్ పృథ్వీకి కోర్టు షాక్..!!

భార్య విషయంలో 30 ఇయర్స్ పృథ్వీకి కోర్టు షాక్..!!

Prudhvi Raj Court Orders: 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్ తెలియని వాళ్లంటూ ఎవరూ ఉండరు. కొన్ని సంవత్సరాలుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు కొనసాగుతున్నారు. ఇప్పుడు భార్యకు పృథ్వి రాజ్ (Prudhvi Raj wife) నెలకు రూ.8 లక్షల భరణం చెల్లించాల్సిందిగా ఆదేశం ఇచ్చింది కోర్టు.

పృథ్వి రాజ్ (Prudhvi Raj Family) ఫ్యామిలీ ఎవరు అసలు ఏమైంది అనే వివరాల్లోకి వెళితే, విజయవాడకు చెందిన శ్రీ లక్ష్మిని 1984లో వివాహం చేసుకున్నాడు పృథ్వి రాజ్(Prudhvi Raj). తన భార్యను విజయవాడలోనే ఉంచుతూ చెన్నైలో సినిమా ప్రయత్నాలు చేసేవాడు. వీరికి ఓ కుమార్తే, కుమారుడు ఉన్నారు.

అయితే పృధ్వీ రాజ్ భార్య (Prudhvi Raj wife) శ్రీలక్ష్మి 2017 లో తనను వేధిస్తున్నాడంటూ కోర్టులో కేసు వేయడం జరిగింది. అయితే తనను తరచూ పృథ్వీరాజ్ వేధించేవాడని శ్రీలక్ష్మీ కోర్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2016 ఏప్రిల్ 5న తనను ఇంటి నుంచి గెంటేశారని, దీంతో తాను పుట్టింటికి వచ్చి అక్కడే ఉంటున్నట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Prudhvi Raj ₹8 lakh Alimony to his Wife
Prudhvi Raj ₹8 lakh Alimony to his Wife

కేసు పరిశీలించిన న్యాయమూర్తి.. పృథ్వీ తన భార్యకు నెలకు రూ.8 లక్షలు చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ప్రతి నెలా 10 తేదీలోగా మెయింటనెన్స్ చెల్లించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. పృథ్వీ ప్రస్తుతం పలు సినిమాల్లో బిజీగా ఉంటూ అలాగే ఇటీవలే మెగా బ్రదర్ నాగ బాబును కలిసి జనసేన పార్టీలో చేరారు. కోర్టు తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. 

 

Related Articles

Telugu Articles

Movie Articles