Adivi Sesh Evaru Movie Review, Telugu Movie Review, Tollywood Reviews
Adivi Sesh Evaru Movie Review, Telugu Movie Review, Tollywood Reviews

విడుదల తేదీ : ఆగస్టు 15, 2019
రేటింగ్ : 3.5/5
నటీనటులు : అడివిశేష్‌, రెజీనా కసండ్ర‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు
దర్శకత్వం : వెంక‌ట్ రామ్‌జీ
నిర్మాత‌లు : వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె
సంగీతం : శ్రీచ‌ర‌ణ్ పాకాల
సినిమాటోగ్రఫర్ : వ‌ంశీ ప‌చ్చిపులుసు
ఎడిటర్ : గ్యారీ బి.హెచ్‌

క్షణం సినిమాతో చిన్న సినిమాలు పెద్ద విజయం అందుకోవడం అనే ఒక ట్రెండ్ ని సెట్ చేసి గూఢచారి తో దాన్ని పీక్స్ కి తీసుకెళ్లాడు అడివి శేష్.ఆ రెండు సినిమాలతో ఆ తరహా థ్రిల్లర్ మూవీస్ కే కాదు తనకంటూ కూడా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.ప్రస్తుతం క్షణం సినిమా ప్రొడ్యూసర్ PVP తో కలిసి మళ్ళీ ఎవరు? అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.చడీచప్పుడు లేకుండా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకి సాహో పోస్ట్ పోన్ అవ్వడంతో లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ కూడా దక్కింది.అలా అనుకోకుండా అన్నీ కలిసొచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా? లేదా?,ట్రైలర్ తెచ్చిన ఇంప్రెషన్ ని నిలబెట్టుకుని హిట్ అనిపించుకుందా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ: తమిళనాడులోని కూనూర్ లో ఒక గెస్ట్ హౌస్ లో సమీరా, DGP అశోక్ ని హత్య చేస్తుంది.అతను ఆమెని మానభంగం చెయ్యడంవల్ల చంపాను అని ఒప్పుకుంటుంది.ఒక పోలీస్ అధికారి మర్డర్ కావడంతో ఆ కేస్ లో నిజానిజాలు విచారించి ఛార్జ్ షీట్ దాఖలు చెయ్యడానికి పోలీసులకు 10 రోజులు టైం ఇస్తుంది కోర్ట్.అయితే ఈ లోగా సమీరా ఆ కేస్ నుండి బయటపడడానికి తన ప్రయత్నాలు మొదలుపెడుతుంది.అందులో భాగంగా విక్రమ్ వాసుదేవ్ అనే కరెప్టెడ్ ఆఫీసర్ కి అసలు అక్కడ ఏం జరిగింది అనేది చెప్పడం మొదలుపెడుతుంది.ఈలోగా ఒక సందర్భంలో సంవత్సరం క్రితం మిస్ అయిన వినయ్ వర్మ మిస్సింగ్ గురించి అతని కొడుకు ఆదర్శ్ అతన్ని వెదుక్కుంటున్న తీరు గురించి వివరిస్తాడు విక్రమ్ వాసుదేవ్.అసలు ఈ రెండు కేసులకు సంబంధం ఏంటి?,అసలు సమీరా ఎవరు?,అశోక్ ని ఆమె ఎందుకు చంపింది?,వినయ్ వర్మ ఏమయ్యాడు?…ఇలా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం సినిమా చూసి తెలుసుకోవాలి.

నటీనటులు: క్షణం,గూఢచారి సినిమాలతో తనలోని సటిల్ యాక్టర్ ని పరిచయం చేసిన శేష్ ఈ సినిమాలో కూడా అదే తరహా యాక్టింగ్ ని కొనసాగించాడు.కానీ విక్రమ్ వాసుదేవ్ అనే కరప్టెడ్ పోలీస్ కి కాస్త రెక్లెస్ యాటిట్యూడ్ పెట్టడానికి ట్రై చేసారు కానీ అది అంతగా సెట్ అవ్వలేదు.అది మినహాయిస్తే శేష్ పాత్రకి,నటనకి వంకలు పెట్టడానికి లేదు.ఇక తెలుగులో సినిమా చేసి చాలాకాలం అయిన రెజీనా ఈ సినిమాలో విక్టిమ్ గా నటించినా కూడా కాస్త గ్లామరస్ గా కనిపించింది.కొన్ని సీన్స్ లో తడబడినా ఓవర్ ఆల్ గా మ్యానేజ్ చేసింది.ఇక నవీన్ చంద్ర,మురళి శర్మ,పవిత్ర లోకేష్ తదితరులంతా సహజమయిన నటనతో ఆకట్టుకున్నారు.

టెక్నీషియన్స్: ఈ సినిమా డైరెక్టర్ వెంకట్ రాంజీ సినిమాని చాలా గ్రిప్పింగ్ గా తెరకెక్కించాడు.ఇది ది ఇన్విజిబుల్ గెస్ట్ కి అఫీషియల్ అడాప్షన్ అయినప్పటికీ కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే ని చాలా జాగ్రతగా చెబుతూ చివరి వరకు కూడా సినిమాలో సస్పెన్స్ మైంటైన్ చేసాడు.డైరెక్టర్ గా అతనికి ఇది మంచి డెబ్యూ సినిమా.అబ్బూరి రవి రైటింగ్ కూడా సినిమాకి చాలా ప్లస్ అయ్యింది.చాలా చిన్న చిన్న డీటైల్స్ ని డైలాగ్స్ తో చెప్పించడం బావుంది.ఇక ఈ సినిమా పేరే శేష్ ఎవరు అని పెట్టారు.దాన్ని బట్టే ఈ సినిమా కథ,కథనంలో,ఈ సినిమా పట్టాలెక్కడంలో,ఈ సినిమా రూపకల్పనలో శేష్ కంట్రిబ్యూషన్ ఎంత అనేది అర్ధమవుతుంది.వంశీ పచ్చిపులుసు ఛాయాగ్రహణం సినిమాకి పెద్ద ఎస్సెట్.లిమిటెడ్ లొకేషన్స్ లో,లిమిటెడ్ ఆర్టిస్టులతో తెరకెక్కిన ఈ సినిమాకి గ్రాండ్ లుక్ రావడంలో అతని హార్డ్వర్క్ కి క్రెడిట్ ఇచ్చి తీరాలి.శేష్ ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల ఆర్.ఆర్ తో సినిమాకి ప్రాణం పోసాడు,సినిమా స్థాయి పెంచాడు,థ్రిల్లర్ మోడ్ ని ఫుల్ గా ఎలివేట్ చేసాడు.గ్యారీ ఎడిటింగ్ కూడా చాలా క్రిస్ప్ గా ఉంది.ఈ సినిమా రన్ టైం రెండుగంటల లోపే ఉంది అంటే సినిమాని ఎంత జాగ్రత్తగా ట్రిమ్ చేసారో అర్ధమవుతుంది.నిర్మాణ విలువలు బావున్నాయి.

ఫైనల్ గా: అడివి శేష్ సినిమా అనే బ్రాండ్ తో PVP ప్రొడక్షన్ నుండి వచ్చిన ఎవరు? నాణ్యమయిన ఒక థ్రిల్లర్.ఈ జోనర్ ని ఆదరించే వాళ్ళు తక్కువగా ఉంటారు కాబట్టి రెజీనా గ్లామర్ ని వేల్యూ ఎడిషన్ గా వాడుకుంటూ, ఎక్కడా బోర్ కొట్టించకుండా అనుక్షణం గెస్సింగ్ స్క్రీన్ ప్లే తో సాగుతూ ఎండ్ ట్విస్ట్ తో కూడా అలరించిన ఎవరు? లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ ని కూడా వాడుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చెయ్యడం ఖాయం.

బోటమ్ లైన్:క్షణ’క్షణం’ ఎవరు?

 

Consider these articles: