ఎంఎస్. రాజు ‘7 డేస్ 6 నైట్స్’ ఫస్ట్ లుక్..!

7Days 6Nights Movie: టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ల లిస్టులో టాప్ ప్లేస్ లో ఉంటారు ఎమ్మెస్‌ రాజు. ఆయన ‘డర్టీ హరి’ సినిమాతో డైరెక్టర్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్సాపీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు ”7 డేస్ 6 నైట్స్” అనే న్యూ ఏజ్ ఎంటర్టైనర్ తో వస్తున్నారు ఎంఎస్ రాజు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సుమంత్ అశ్విన్ – ఎస్. రజనీకాంత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘7 డేస్ 6 నైట్స్’ సినిమా ప్రారంభంలో తనయుడిని నిర్మాతగా మాత్రమే ప్రకటించిన ఎం.ఎస్. రాజు.. లేటెస్ట్ గా ఓ పోస్టర్ రిలీజ్ చేసి ఇందులో సమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నాడనే విషయాన్ని స్పష్టం చేశారు. సుమంత్ అశ్విన్ సరసన మెహర్ చావల్ అనే కొత్తమ్మాయి హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సందర్భంగా ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ..డర్టీ హరి సక్సెస్ తర్వాత ఆడియెన్స్ అదే జోనర్ లో మరో సినిమా చేయాలనుకున్నారు. కానీ ఈ చిత్రం పూర్తిగా కొత్త పంథాలో సాగుతుంది. మా బ్యానర్ టాలెంట్ కలిగిన కొత్త నటీనటులను ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేస్తూ బ్రేక్ ఇస్తుంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేశాం. త్వరలోనే నెక్ట్స్ షెడ్యూల్స్ మొదలుపెడతామని చెప్పారు.

 

Show comments

Related Articles

Telugu Articles

Movie Articles