Pushpa 2 box office collection today: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అలాగే రష్మిక జంటగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 (Pushpa 2 The Rule) బాక్సాఫీస్ వద్ద సంచలమైన రికార్డ్స్ సృష్టిస్తుంది. విడుదలైన మొదటి రోజు దగ్గర నుండి బాక్సాఫీస్ (Box office) వద్ద తన సత్తాను చాటుతున్నాడు అల్లు అర్జున్. పుష్పాకి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలను ఉండగా విడుదలైన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ, తమిళ్ అండ్ కర్ణాటకలో ఎక్సలెంట్ కలెక్షన్స్ (Collection) ని సొంతం చేసుకుంటుంది.
సినిమా విడుదలైన 5వ రోజులకే 920 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకున్న పుష్ప 2, ఇప్పుడు 1000 కోట్ల క్లబ్ లోకి 6వ రోజుతో అడుగుపెట్టింది. అయితే ఇక్కడ పుష్ప 2 కలెక్షన్స్ (Pushpa 2 Collection) మీద చాలామందికి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఎంత వరకు నిజం.. ఒకవైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే.. మరోవైపు సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన బుకింగ్స్ ని వీడియోల ద్వారా వివరిస్తున్నారు. గత రెండు రోజులుగా ఒక్క హైదరాబాదులోనే 50% బుకింగ్స్ లేని సినిమాకి వందల కోట్లు గ్రాస్ ఎలా వస్తుంది అంటూ నిలదీస్తున్నారు కొంతమంది యూట్యూబర్స్ అలాగే క్రిటిక్స్.
టాలీవుడ్ లో ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ అయిన నెగిటివ్ ప్రచారం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇక కలెక్షన్స్ గురించి వస్తే ఇటు ట్రేడ్ వర్గాల వారు చెప్పేది నిజమా లేదు అంటే ప్రొడ్యూసర్లు అఫీషియల్ గా విడుదల చేసే పోస్టర్లు నిజమా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సితార ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్ నాగ వంశీ చెప్పిన విధంగా నెంబర్లు అనేవి ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి అని ఒకేసారి అర్థమవుతుంది.
ఇక 6వ రోజు పుష్ప 2 కలెక్షన్ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో 156 కోట్ల షేర్ ని రాబట్టగా… ఓల్డ్ వైడ్ గా 479 కోట్ల షేర్ ని రాబట్టింది.. ఇక పుష్ప బిజినెస్ విషయానికి వస్తే 600 కోట్ల బిజినెస్ చేసిన సినిమా.. 620 కోట్లు రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం 78% రికవరీ చేసిన సినిమా హిట్ స్టేటస్ తెచ్చుకోవడానికి ఇంకా 140 కోట్లు వసూలు చేయాలి.. ఏది ఏమైనా పుష్ప టు సినిమాతో అల్లు అర్జున్ కూడా 1000 కోట్ల క్లబ్బులో చేరినందుకు అందరూ సంతోషిస్తున్నారు.