Game Changer Overseas Booking premiere Sales Report: శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ పొలిటికల్ డ్రామా గేమ్ ఛేంజర్ జనవరి 10న విడుదలకు సిద్ధం చేశారు మేకర్స్. కైరా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా చేస్తున్నారు ఈ సినిమాలో.. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ అలాగే టీజర్ తో భారీ హైప్ తెచ్చుకున్న సినిమా ఇప్పుడు ఓవర్సీస్ లో బుకింగ్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక గేమ్ ఛేంజర్ ఓవర్సీస్ బుకింగ్స్ రిపోర్ట్ ఎలా ఉన్నాయి.
టాలీవుడ్ హీరోస్ అందరూ యూకే.. ఆస్ట్రేలియా వీటికంటే ముఖ్యంగా నార్త్ అమెరికా రికార్డ్స్ ఎక్కువగా నమోదు చేస్తూ ఉంటారు.. ఇప్పుడు అదే విధంగా గేమ్ ఛేంజర్ సంబంధించిన నార్త్ అమెరికా బుకింగ్స్ రీసెంట్గా ఓపెన్ చేయడం జరిగింది. ప్రస్తుతం అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం గేమ్ ఛేంజర్ USA ప్రీమియర్ సేల్స్ 2143 టికెట్లు అమ్ముడుపోగా $60k డాలర్స్ ని క్రాస్ చేయటం జరిగింది. ఇక ఆధార్ కంట్రీస్ చూసుకుంటే యూకే.. ఆస్ట్రేలియా.. ఐర్లాండ్ అన్నిటి కలిపి $77k నమోదు చేసింది.
టోటల్ గా గేమ్ ఛేంజర్ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్ సేల్స్ $140k క్రాస్ చేసినట్టుగా బాక్స్ ఆఫీస్ వద్ద తెలుస్తుంది. అయితే నార్త్ అమెరికా ఇంకా పూర్తిగా షోస్ ని విడుదల చేయాల్సి ఉంది. ఇక పూర్తిగా విడుదలైన తర్వాత రామ్ చరణ్ రికార్డులు తిరగరాస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. గేమ్ ఛేంజర్ సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని మొదటిసారిగా మేకర్స్ డల్లాస్ లో నిర్వహిస్తున్నారు.. దీని తరువాత సినిమా పై మరింత భారీ హైప్ పెరిగి సేల్స్ కూడా పెరిగే అవకాశం లేకపోలేదు.