Prabhas Fauji Shooting location: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సలార్, కల్కి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా చేస్తున్న విషయం తెలిసింది.. దీనితోపాటు మారుతీ దర్శకత్వంలో వస్తున్న రాజా సాబ్ కూడా షూటింగ్ చేస్తున్నారు. రీసెంట్ గా ప్రభాస్ కి పోజి షూటింగ్ లో గాయం అయిన విషయం తెలిసిందే.. దీనికి సంబంధించి ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకొని రెస్ట్ మూడ్లో ఉన్నారు ప్రభాస్ గారు.
అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు.. అనురాగపూడి అలాగే ప్రభాస్కు సంబంధించిన సౌజి సినిమా రామోజీ ఫిలిం సిటీ లో కొన్ని సెట్స్ వేయక మిగతా షూటింగ్ అంతా రియల్ లొకేషన్స్ లో జరుగుతుందని తెలుస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలకమైన భాగాలను ఐకానిక్ సిటీ కోల్‌కతాలో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాజధాని దాని గొప్ప వారసత్వం మరియు విలక్షణమైన బెంగాలీ సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. ఫౌజీ అనేది స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా కాబట్టి కొన్ని సన్నివేశాలను రియల్ లొకేషన్స్ లో చేస్తున్నారట టీం.
ఇమాన్వి హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్న ఫౌజీ సినిమాలో ఎమోషనల్ లవ్ స్టోరీ కూడా ఉంది అని సమాచారం.