Latest Posts

AA22: అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా షూటింగ్ డేట్ ఇదే

- Advertisement -

Allu Arjun – Trivikram Movie Shooting date: అల్లు అర్జున్ ప్రస్తుతం తలకు మించిన భారాన్ని మోస్తున్నారు.. పుష్ప టు ప్రీమియర్ సందర్భంగా జరిగిన ఇష్యూ ఎప్పుడూ చిలికి చిలికి గాలి వానగా మారుతుంది.. మరి ఇది ఎంత దూరం వెళ్తుంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది.. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే పుష్ప టు సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాని గత సంవత్సరమే గీత ఆర్ట్స్ అలాగే హారిక హాసిని బ్యానర్ పై ఎనౌన్స్ అనౌన్స్ చేయడం జరిగింది.

కొన్ని నెలల క్రితం ప్రొడ్యూసర్ నాగ వంశీ కూడా ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ త్రివిక్రమ్ అలాగే అల్లు అర్జున్ సినిమా మీ ఊహకి అందని రేంజ్ లో ఉంటుందని.. అలాగే ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయబోతున్నట్లు తెలిపారు..  ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చివరి దశలో ఉన్నట్టు వివరించారు..

- Advertisement -

తాజాగా, నిర్మాత నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అల్లు అర్జున్-త్రివిక్రమ్ (Allu Arjun – Trivikram) కాంబినేషన్‌లో రాబోయే సినిమా గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. ఆయన ప్రకారం, ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ 2025 మార్చి నుండి ప్రారంభం కానుంది. మొదట, హీరో లేని సన్నివేశాలను చిత్రీకరించి, అల్లు అర్జున్ జూన్‌లో షూటింగ్‌కు జాయిన్ అవుతారని నాగవంశీ తెలిపారు.

ఈ ప్రకటనతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాగవంశీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.

- Advertisement -

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబో గురించి:

గతంలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి హ్యాట్రిక్ హిట్స్‌తో ఈ కాంబో అభిమానుల మనసు గెలుచుకుంది. ఇప్పుడు ఈ జోడీ నాలుగోసారి కలిసి భారీ బడ్జెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం.

సినిమాపై ప్రత్యేకతలు

  • ఇది త్రివిక్రమ్ కెరీర్‌లో తొలి పాన్-ఇండియా సినిమా.
  • సినిమా రాజమౌళి కూడా టచ్ చేయని ఓ కొత్త జానర్‌లో రూపొందుతోంది.
  • ఇది భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుండటంతో భారీ నిర్మాణ విలువలతో అలరిస్తుందన్న అంచనాలు ఉన్నాయి.

ఈ అప్డేట్‌తోనే ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఆసక్తి మిన్నంటుతోంది. సినిమా ప్రారంభం నుంచి విడుదల దాకా ప్రతి దశలో నూతన అంచనాలను చేరుకోబోతోందని స్పష్టంగా తెలుస్తోంది

- Advertisement -

Latest Posts

Trending News

Related Articles