నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా, కొల్లి బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం “డాకు మహారాజ్” పై భారీ అంచనాలు ఉన్నాయి. మేకర్స్ సినిమాపై హైప్ తీసుకురావడానికి ఇప్పటికే ప్రమోషన్ లో భాగంగా రెండు సాంగ్స్ ని విడుదల చేయగా రెండు సాంగ్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.
ఈ చిత్రంలో మాస్ ఆడియెన్స్‌కు విపరీతమైన ట్రీట్ ఇచ్చే సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో, ఇంటర్వెల్ బ్యాంగ్‌కు 20 నిమిషాల ముందు ఉండబోయే ఓ క్రేజీ ఎపిసోడ్ గురించి నిర్మాత నాగ వంశీ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
మేకర్స్ చెబుతున్న ప్రకారం, ఈ ఎపిసోడ్ మాస్ ఫ్యాన్స్‌కు నిజమైన పండగగా మారనుంది. ఇది ఊహించని స్థాయిలో ఆసక్తికరంగా ఉండి, ప్రేక్షకులను థ్రిల్ చేసేలా ఉంటుందని టాక్. మొత్తానికి “డాకు మహారాజ్”పై మేకర్స్ అద్భుతమైన హైప్ క్రియేట్ చేసినట్లు చెప్పవచ్చు. జనవరి 12న విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి!