మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) మరో భారీ ప్రాజెక్ట్‌కు (New Movie) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. MAD చిత్రంతో ఆకట్టుకున్న దర్శకుడు కల్యాణ్ శంకర్ (Kalyan Shankar) దర్శకత్వంలో ఓ సూపర్ హీరో సినిమాకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాత నాగ వంశీ నిర్మించనున్నారని చిత్రంబలరే మొదటగా వెల్లడించింది.
రవితేజ సూపర్ హీరోగా – ఆసక్తికరమైన కథ:
ఇప్పుడప్పుడే వచ్చిన తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా పూర్తిగా సూపర్ హీరో జానర్ లో రూపొందనుంది. సినిమా స్క్రిప్ట్ వినగానే రవితేజ పాత్ర పట్ల ఉత్సాహంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాలీవుడ్ వర్గాల సమాచారం. యాక్షన్, కామెడీ, మాస్ మసాలా ఎలిమెంట్స్‌తో రవితేజ ఇప్పటి వరకు ప్రేక్షకులను ఎంతగా మెప్పించారో తెలిసిందే. అయితే, ఈసారి సూపర్ హీరో అవతారంలో ఆయన ఎలా మెప్పిస్తారో అనేది ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని కలిగిస్తోంది. \
కల్యాణ్ శంకర్ మాజిక్ – విభిన్నమైన కథనంతో రాబోయే చిత్రం:
తన తొలి సినిమా MAD తో యూత్‌ను ఆకట్టుకున్న దర్శకుడు కల్యాణ్ శంకర్ ఈ కొత్త సూపర్ హీరో కథను మరింత వినోదాత్మకంగా, ఆసక్తికరంగా మలచబోతున్నారని అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్‌లో సూపర్ హీరో సినిమాలకు ఆదరణ పెరుగుతుండటంతో, రవితేజ నటించనున్న ఈ చిత్రం భారీ అంచనాలు పెంచుకుంది.
ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌పై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. మరిన్ని అప్‌డేట్స్ కోసం ఎదురుచూడండి.