Latest Posts

విశ్వంభర సినిమా షూటింగ్ కి బ్రేక్.. మళ్లీ ఎప్పుడు మొదలు..?

- Advertisement -

Vishwambhara Shooting Update: చిరంజీవి తదుపరి సినిమా వశిష్ట దర్శకత్వంలో వస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాకి విశ్వంభర అనే టైటిల్ని ఫిక్స్ చేశారు.. అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాని సంక్రాంతి 2025 కి విడుదల చేయాలని ముందుగానే డేట్ ని ప్రకటించారు.. అయితే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా కోసం పోస్ట్ ఫోన్ చేయడం జరిగింది.. లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు విశ్వంభర సినిమాని మే 9న విడుదలకు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇదే డేట్ కి జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా కూడా విడుదలైంది.

Vishwambhara Shooting Update:అందుతున్న సమాచారం మేరకు విశ్వంబరా షూటింగ్ కి బ్రేక్ వేయాల్సి వచ్చింది.. ముందుగా అనుకున్న డేట్ కి సినిమాని తీసుకురావాలని శరవేగంగా జరిపిన షూటింగు ఎట్టకేలకు బ్రేక్ వేశారు.. దీనికి సంబంధించిన వివరాలు లోకి వెళ్తే చిరంజీవి (Chiranjeevi) గత కొంతకాలంగా చికెన్ గునియా వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుస్తుంది.

- Advertisement -

ఇక చిరంజీవి ఫుల్ రికవరీ అయిన తర్వాత షూటింగ్ తిరిగి ప్రారంభించాలని మునికర్స్ భావిస్తున్నారంట.. అయితే సినిమా షూటింగ్ విషయానికి వస్తే ఇప్పటికే 80 శాతం పూర్తి చేసుకున్న సినిమాలో ఇంకో రెండు సాంగ్స్ మిగిలి ఉన్నట్టు సమాచారం. సంక్రాంతి ముగించుకొని జనవరి నెలలోనే సినిమాని తిరిగి షూటింగ్ ప్రారంభిస్తారని ఫిలింనగర్ లో గుసగుసలు వినపడుతున్నాయి.

ఇప్పటికే విడుదలైన విశ్వంభరా టీజర్ అత్యంత భారీ హైట్ తీసుకురాగా సినిమా మరింత విజువల్ వండర్ గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది ఈ త్రిష హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే అలాగే మరికొంత హీరోయిన్స్ కూడా సినిమాలో చేస్తున్నారంట.. ఆషిక రంగనాథ్ ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపిస్తున్నట్టు చెబుతున్నారు.

- Advertisement -

Latest Posts

Trending News

Related Articles